ఆస్పత్రులకు వణుకు పుట్టించిన ముఖ్యమంత్రి

Update: 2016-06-13 04:52 GMT
మాట వినని ఆసుపత్రులపైన ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పేదలకు ఉచిత వైద్యం ఇచ్చేందుకు నో అనేసిన ఐదు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సామాన్యుడి సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామంటూ హామీ ఇచ్చి 1960 నుంచి 1990 వరకు రాయితీలో న్న భూమిని ప్రభుత్వం కేటాయించింది.

నిబంధనల్ని ఉల్లంఘించిన ఆసుపత్రులకు 2015 డిసెంబరులో కేజ్రీవాల్ సర్కారు నోటీసులు ఇచ్చింది. కానీ.. వారి నోటీసులకు సంతృప్తి కరమైన సమాధానాన్ని ఇవ్వని ఆసుపత్రుల తీరుపై మండిపడిన కేజ్రీసర్కారు తాజాగా ఈ ఐదు ఆసుపత్రులపై కొరడా ఝుళిపించింది. ఈ ఐదు ఆసుపత్రులు రూ.600 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జులై 9 లోపు ఫైన్ చెల్లించకుండే తదుపరి చర్యలకు తాము సిద్ధమన్నట్లుగా కేజ్రీసర్కారు చెబుతోంది.

ఇక.. ఫైన్ వేసిన ఆ ఐదు ఆసుపత్రులు ఏవంటే..

1.        మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (సాకేత్)

2.        ఫోర్టిన్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్

3.        శాంతి ముకంద్ ఆసుపత్రి

4.        ధరమ్ శీల క్యాన్సర్ ఆసుపత్రి

5.        పుష్పవతి సింఘానియా పరిశోధనా సంస్థ
Tags:    

Similar News