ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి ప్రస్తుతం అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు 143 మందిని అరెస్టు చేశారు. రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లను తగులబెట్టడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలపై రాజకీయాలకు అతీతంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 143 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జనసేన, టీడీపీలకు చెందినవారు అత్యధికంగా ఉండటం గమనార్హం. జనసేనకు చెందిన వారు 62 మంది, టీడీపీకి చెందిన వారు 21 మంది ఉండగా... బీజేపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన వారు చెరో ఐదుమంది ఉన్నారు. మిగిలిన 50 మంది ఏ పార్టీకి చెందని వారుగా పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రమేయం ఉందని భావించిన వైఎస్సార్‌సీపీకి చెందినవారిని కూడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటివరకు పోలీసులు 268 మంది ఆందోళనకారులను గుర్తించారు. ఇప్పటికే 143 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 126 మంది కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తున్నారు.
సీసీ ఫుటేజీలు, గూగుల్ ట్రాక్‌లు, టవర్ లొకేషన్లు, వాట్సాప్ గ్రూపులు వంటి సాంకేతిక సాధనాల ఆధారంగా ఈ కేసులను 14 పోలీసు బృందాలు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నాయి.
మరోవైపు పథకం ప్రకారం అమలాపురంలో విధ్వంసకర ఘటనలకు, అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారులను ఎవరినీ వదలబోమని పోలీసులు చెబుతున్నారు. ఈ అల్లర్లలో కేసులు నమోదైన నిందితులందరిపైనా త్వరలోనే రౌడీషీట్లు తెరుస్తామని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన నేరానికి వారిపై పీడీపీపీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
అలాగే కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆస్తులను అకౌంట్‌బులిటీ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల వ్యక్తిగత ఆస్తులపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు తయారు చేయించారు. నిందితుల ఆస్తులపై సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంలో మార్కెట్ రేట్లకు రెండురెట్లు అదనంగా నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేసే యోచనలో ఉన్నారు.