దేశంలో విద్య , వైద్యం ..ఈ రెండింటి పై చేసే ఖర్చుతోనే పేద , మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు అవుతున్నారు. ఈ పరిస్థితి గుర్తించిన ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ ఈ సమస్య పై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్న జగన్ ప్రభుత్వం ...తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి సైతం మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
మూడు దశల్లో వాటిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తొలి విడతలో భాగంగా టెండర్లు వీలైనంత త్వరగా పిలిచి జనవరి 3 లేదా 4వ వారంలో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సమీక్షా లో వైద్య ఆరోగ్య రంగంపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇంత వరకు అమలు చేసిన, ఇక నుంచి అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులు వివరించారు. సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్తగా నిరి్మంచతలపెట్టిన కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు.
అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో ఇక నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తేదీలని నిర్ధారించారు. జనవరి 1 నుంచి కొత్త వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డుల జారీని ప్రారంభించాలి అని , 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ,ని పైలట్ ప్రాజెక్ట్‌గా జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి మిగిలిన 12 జిల్లాల్లో 1,200 రోగాలకు ఆరోగ్యశ్రీని అమలు చేయబోతున్నారు. అలాగే ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని ఈ సమావేశంలో మరోసారి సీఎం స్పష్టం చేశారు.