ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. ఈ ప్రక్రియ జరిగి ఐదేళ్లు పూర్తయింది. 2016 నవంబర్ 8న ప్రధాని డీమానిటైజేషన్ అనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రూ.1000, రూ.500 రద్దు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ నిర్ణయం కేవలం నల్లధనాన్ని వెలికితీయడం కోసమేనని మోదీ అప్పట్లో ప్రకటించారు. బ్లాక్ మనీ అంతా కూడా పెద్ద నోట్ల రూపంలో పేరుకుపోయిందని ఆయన చెప్పారు. ఈ మేరకు డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2016 డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని సూచించారు. అప్పడు ప్రజలు ఎదుర్కొన్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. బ్యాంకుల ఎందుట చాంతాడంతా లైన్లలో నిలబడి మరీ డబ్బులను మార్చుకున్నారు. అయితే ఈ ప్రక్రియ జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ, హార్వర్డ్ షాకింగ్ కామెంట్స్ చేశాయి.
పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా డీమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు పీఎం మోదీ. అయితే ఈ నిర్ణయాన్ని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రశంసించింది. నాటి నుంచి నేటి వరకు డిజిటల్ పేమెంట్లు పెరుగుతూ వస్తున్నాయని ప్రకటించింది. నోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించింది. ఇందులో యువత పాత్ర కీలంగా ఉందని పేర్కొంది. డీమానిటైజేషన్ జరిగిన రెండేళ్ల దాకా నగదు రహిత ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిపారని చెప్పింది. ఇలా నాటి నుంచి నేటివరకు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని వివరించింది. 2017 నుంచి ఈ వృద్ధిరేటు సంప్రదాయ లావాదేవీలను అధిగమించినట్లు తెలిపింది. అయితే సంప్రదాయ పేమెంట్స్ కన్నా డిజిటల్ చెల్లింపులు పెరగడం నిజానికి చాలా మంచి పరిణామం అని కొనియాడింది. ప్రధాని తీసుకున్న నిర్ణయంతో కీలక మార్పులు జరిగాయని స్పష్టం చేసింది.
దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రోత్సహించిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో నగదు ఆర్థిక వ్యవస్థ క్రమంగా తగ్గిందని తెలిపింది. డీమానిటైజేషన్ నిర్ణయమే ఇందుకు కారణమని తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 16.41 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అది 14శాతానికి పైగా వృద్ధి చెందిందని నివేదికలో ప్రస్తావించింది. ఈ క్రమంలో 2020-21 వరకు రూ.32.62 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయని... అది 2021 వరకు రూ.28.26 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. అయితే ఇది చాలా తక్కువని తెలిపింది. డీమానిటైజేషన్ ప్రక్రియతో దేశంలో నగదు రహిత చెల్లింపులు మాత్రం గణనీయంగా పెరిగాయని స్పష్టం చేసింది.
పెద్దనోట్ల రద్దుతో భారతదేశం అప్పట్లో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2016 నవంబర్ 8న పీఎం మోదీ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ బ్యాంకుల ముందు బారులు తీరారు. ఇగ నగదు కోసం నానా అవస్థలు పడ్డారు. అయితే సరిగ్గా అదే సమయంలో చాలామంది డిజిటల్ చెల్లింపులపై ఆసక్తి చూపారు. తొలుత యువతే ఈ ఆన్ లైన్ పేమెంట్లను ఎక్కువగా ఉపయోగించింది. క్రమంగా ఆ సేవలు ఇవాళ అందరూ ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ ఇండియా వైపుగా పరుగులు పెట్టడానికి ఈ డిజిటల్ పేమెంట్స్ చాలా ఉపయోగపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ నుంచి పాన్ షాపు దాకా ఆన్ లైన్ పేమెంట్లు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ విధంగా నగదు రహిత భారతదేశం ముందుకెళ్తోంది. అందుకే పెద్దనోట్ల రద్దు ప్రక్రియను ఆర్బీఐ, హార్వర్డ్ కొనియాడాయి.