ప్రపంచాన్ని షేక్ చేస్తున్న

Update: 2020-03-14 21:30 GMT
ఈ ప్రపంచ వ్యాప్తంగా రోజుకో కొత్త ఛాలెంజ్ వెలుగులోకి వస్తుంది. ఎవరో ఒకరు ఫాలో అయ్యి ..వేరేవారికి విసిరిన ఛాలెంజ్ ని ...ఛాలెంజ్ గా తీసుకోని చాలామంది ఆ ఛాలెంజ్ ని పూర్తి చేస్తుంటారు. ఇటువంటి సమయంలోనే తాజాగా టిక్ టాక్ లో ఇప్పుడు ఓ ఛాలెంజ్‌ హవా నడుస్తోంది. ఫ్లిప్‌ ది స్విఛ్‌ అనే ఈ ఛాలెంజ్‌ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

అసలు ఈ ఫ్లిప్‌ ది స్విఛ్‌ ఛాలెంజ్‌ కోసం ఇద్దరు వ్యక్తులు అవసరం. ఆ ఇద్దరూ వ్యక్తులు అద్దం ముందు నిలబడతారు. అద్దానికి దగ్గరగా ఒకరు సెల్‌ ఫోన్‌ పట్టుకుని నిల్చుని ఉంటే.. మరొకరు వారి వెనకాల డ్యాన్స్‌ చేస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తమ ప్లేస్‌లను మార్చుకుంటారు. ప్లేసుల తో పాటు బట్టలు కూడా మార్చుకుంటారు. ఆ తరువాత అప్పటివరకు అద్దం ముందు సెల్‌ ఫోన్‌ పట్టుకుని నిలబడ్డ వ్యక్తి డ్యాన్స్‌ చేస్తే.. డ్యాన్స్‌ చేసిన వ్యక్తి అద్దం ముందు నిలబడతాడు. ఈ ఛాలెంజ్‌ ను బెల్లా, డాలిన్‌ రాంబర్ట్‌ అనే వారు మొదలు పెట్టారు. ఆ తర్వాత దీన్ని వేల మంది ఫాలో అయ్యారు. వారిలో సినీ, రాజకీయ, సోషల్‌మీడియా ప్రముఖలు ఉన్నారు.

గాయని, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌, సెనేటర్‌ ఎలెజెబెత్‌ , కమెడియన్‌ కేట్‌ మెక్‌ కిన్నాన్‌ తో పాటు మరికొంత మంది ప్రముఖులు ఈ ఫ్లిప్‌ ది స్విఛ్‌ ఛాలెంజ్‌ లో పాల్గొన్నారు. జెన్నిఫర్‌ లోపెజ్‌, అలెక్స్‌ రోడ్రిగేజ్‌తో కలిసి చేసిన వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. దాదాపు 42మిలియన్ల వ్యూస్‌ తో దూసుకుపోతోంది. సెనెటర్‌ ఎలెజెబెత్‌, కేట్‌ మెక్‌కిన్నాన్‌ల ఛాలెంజ్‌ వీడియో ట్విటర్‌ ఉంచిన కొన్ని గంటలకే 22మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. అలాగే కొద్దిరోజుల కిత్రం నటి సమీరారెడ్డి అత్తతో కలిసి ఈ ఛాలెంజ్‌ ను పూర్తిచేశారు.
Tags:    

Similar News