కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే కరోనా డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచ దేశాలు పోరాటం చేయలేకపోతుంటే.. కొత్తగా మరో వైరస్ వెలుగు చూసింది. దీనిని ఇజ్రాయిల్ దేశంలో గుర్తించినట్లు ఆ దేశా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వైరస్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనిని ఓ గర్భిణిలో ముందుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వైరస్ మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ వైరస్ ఇన్ఫూఎంజాకు చెందిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనికి ఫ్లోరినా అనే పేరు పెట్టనట్లు పేర్కొన్నారు. ఇప్పటికి కేవలం ఒక్కరిలోనే ఈ వైరస్ ను గుర్తించినట్లు తెలిపిన వైద్యులు.. ఇతరులకు వ్యాపించే దానిపై స్పష్టం ఇవ్వలేదు. కానీ దీనితో ప్రాణహాని ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది కరోనా, ఒమిక్రాన్ లాంటిది కాదని తెలిపిన నిపుణులు... ఫ్లోరినా తో బాధపడే వారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. చివరకు రోగి ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. ఇటీవలే ఇజ్రాయిల్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. అలా వైరస్ వెలుగు చూసిన కొద్ది రోజులకే ఇది బయటపడడం ఆరోగ్య శాఖ అధికారులను కలవరానికి గురి చేస్తుంది.
సాధారణంగా కొవిడ్ మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొవిడ్ వ్యాప్తి చెందిన తరువాత ఎలాంటి కేసు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైన దానిగా మారేందుకు కొవిడ్ తో పాటు ఇన్ఫ్లుఎంజా కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం సుమారు 11 లక్షల కేసులు వెలుగు చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా రెండు లక్షలకు పైగా కేసులు నిర్ధారణ అయినట్లు ఆ దేశ వైద్య అధికారులు తెలిపారు. ఆ తర్వాత స్థానాలలో బ్రిటన్, ఇటలీ , అమెరికా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. సుమారు మూడు లక్షలకు పైగా కేసు లోడు తగ్గినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో వైపు కొత్తగా నమోదయ్యే కేసుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిని కట్టడి చేయడానికి ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు సూచనలు చేస్తోంది. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో ఇవ్వడం వల్ల రోగులు ఆస్పత్రి బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతోంది. దీంతో దేశాలు టీకా పంపిణీ పై దృష్టి సారిస్తున్నాయి.