ఏపి గవర్నమెంట్ పైన విరుచుకుపడిన నిర్మలా సీతారామన్

Update: 2020-06-27 03:00 GMT
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుగోడలుగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ పాలన మారింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీలు అనుసరిస్తున్న కుల తత్వ, అవినీతి, వారసత్వ, కుహనా లౌకిక వాదం వంటి విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలిచాయని, వాటిని ధ్వంసం చేసి  రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం భారతీయ జనతా పార్టీ వలనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఎన్డీయే - 2 పాలన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మూడో “జన-సంవేద్ వర్చువల్ ర్యాలీని ” శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మోదీ. 2.0 ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షిస్తూ బీజేపీ లక్షల కోట్ల నిధులిచ్చిందని, పలు ప్రాజెక్టులు అమలుచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీలోని తొమ్మిది జిల్లాలు సముద్ర తీర ప్రాంతం లో మత్స్యకారులు ఉన్నారు. 546 మత్స్యకారులు నివసించే గ్రామాలు ఉంటే.. 349 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం ఆరు లక్షల మందికి పైగా మత్స్య‌కారులు ఉండగా, నేడు ఎనిమిది లక్షల మంది ఉన్నారు. ఎపీలో 1.63 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దేశ వ్యాప్తం గా ఇరవై వేల కోట్లు మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల ప్రయోజనం కోసం కేంద్రం ఇచ్చిందన్నారు. ఇందులో పదకొండు వేలకోట్ల రూపాయలు ఇన్లాండ్ ఫిషింగ్ మెరైన్ ఫిషింగ్, ఆక్వా కల్చర్‌కు కేటాయించామని. రాష్ట్రంలోని మత్స్యకారులు ఈ ఆక్వా, మెరైన్ ఫిషింగ్ లను బాగా వినియోగించుకోవాలన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పార్టీలు గెలిచాక అమలు చేయాల్సిందేనని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.  అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తే దేశవ్యాప్తంగా జరిగే ప్రాజెక్టులకు సమస్యలు ఏర్పడతాయని, కేంద్ర ప్రభుత్వం రూ.2.75 లకు విద్యుత్ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రూ.9 లకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడం  విని ఆశ్చర్యపోయాన‌ని ఆమె అన్నారు. దీని వల్ల పరిశ్రమలపై ఆర్థిక భారం పడి అవి మనలేవని, డిస్కంలకు నష్టం వస్తే కేంద్రం భరిస్తోందని అన్నారు. అందుకు రూ.90 వేల కోట్లు ఇస్తామని ప్రకటించామని వివ‌రించారు.  రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని చెబుతారని తెలిపారు. కలెక్షన్, కుటుంబం, కుహనా లౌకికవాదం, కులతత్వం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్న నిర్మ‌లా సీతారామ‌న్ బీజేపీ కార్యకర్తలకు వీటికి అతీతం గా పోరాడి ప్రజల్లోకి వెళ్లి భాజపాను బలపరచి అధికారం లోకి రావాలని సూచించారు.


Tags:    

Similar News