సోషల్ మీడియాతో లాభాల మాట ఎలా ఉన్నా.. నష్టాలు కూడా భారీగానే ఉంటున్నాయి. బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే ఫర్లేదు. కానీ.. అత్యుత్సాహంతోనో.. ఆవేశంతోనో.. టార్గెట్ చేస్తున్న వైనంతో కొత్త కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. ప్రసార మాధ్యమాల్ని తలదన్నేలా సోషల్ మీడియా ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది. అదెంత వరకూ వెళ్లిందంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలకు సంబంధించి అసలు విషయాన్ని వివరించేందుకు కథనాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.తాజాగా ఇలాంటి ఉదంతమే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండే రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ మీద సోషల్ మీడియాలో పలు ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. వారు వడ్డించే నాన్ వెజ్ ఫుడ్ లో కుక్క మాంసం ఉందన్నది తీవ్రమైన ఆరోపణ. ఏ అధికారి అధికారికంగా ఇలాంటి సమాచారం వెల్లడించకున్నా.. మీడియాలో వార్తలు వచ్చాయంటూ మొదలైన ఈ ప్రచారం అంతకంతకూ పెద్దది కావటంతో అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది.
దీంతో.. జీహెచ్ ఎంసీ అధికారులు ఈ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి మాంసాహారాన్ని సేకరించి.. ఆ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. హోటల్ యజమానుల వెర్షన్ వేరుగా ఉంది.తాము పాతికేళ్లుగా హోటల్ బిజినెస్ లో ఉన్నామని..15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులు తమకొచ్చాయని.. తమ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకే ఇలాంటి వదంతుల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ వాపోతున్నారు. తమ మీద జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని వారు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో తమ మీద సాగుతున్న తప్పుడు ప్రచారంపై సోషల్ మీడియాలో కంప్లైంట్ చేశామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ హోటల్ యాజమాన్యం కొనుగోలు చేస్తున్న మాంసం బిల్లులు తమకు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ ఒక్క హోటల్ కు మాత్రమే కాకుండా.. గ్రేటర్ పరిధిలోని అన్ని హోటళ్లకు ఇదే తరహా నోటీసులు జారీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ గురించి చెప్పేది ఒక్కటే. సోషల్ మీడియాలో వచ్చే సంచలన అంశాలకు సంబంధించిన పూర్వపరాల్ని పరిశీలించకుండా.. అదే పనిగా షేర్ చేస్తే.. మీరూ చిక్కుల్లో చిక్కుకోవటం ఖాయం. ఇదొక్క విషయమే కాదు.. వివాదాస్పద అంశాల విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవటం పక్కా. సో.. బీకేర్ ఫుల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/