ఎయిర్ పోర్టు భూముల కోసం... ఏపీ సర్కార్ ఫోకస్...?

Update: 2022-04-26 00:30 GMT
విశాఖ ఎయిర్ పోర్టు ఇక అభివృద్ధి చెందదు. ఇప్పటికే చాలా ప్రగతి సాధించింది. అయితే ఫ్యూచర్ లో విశాఖలో ఈ ఎయిర్ పోర్టు కూడా కొనసాగే అవకాశం లేదు. అందుకే ఆల్టర్నేషన్ గా భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మిస్తున్నారు. దాంతో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విషయంలో ఫోకస్ పెట్టడంలేదు. ఈ నేపధ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు కు రెండు దశాబ్దాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 74 ఎకరాల అత్యంత ఖరీదైన భూములను వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాసింది.

ప్రస్తుతం ఈ లేఖ మీద చర్చ సాగుతోంది. దీని వెనక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అన్నదే ఆ చర్చ. విషయానికి వస్తే విశాఖ ఎయిర్ పోర్టు రక్షణ శాఖ నియంత్రణలో ఉంటుంది. అక్కడ ఐ ఎన్ ఎస్ డేగా కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. అదే విధంగా ఇక్కడ నుంచే పైలట్లకు యుద్ధ విమానాలను నడిపేందుకు శిక్షణ ఇస్తారు. అలాగే దేశ భద్రత పరంగా చూస్తే ఈ ఎయిర్ పొర్టు చాలా కీలకమైనది.

ఈ కారణంగానే పౌర విమానాలకు ఎన్నో ఆటంకాలు పెడుతున్నారు. వేరే ఆల్టర్నేషన్ చూసుకుని పౌర విమానాల రాకపోకలను  అక్కడ నుంచ కొనసాగించాలని కూడా చాలా కాలంగా కోరుతున్నారు. దాని ఫలితంగానే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అన్నది ముందుకు వచ్చింది. సరే దాని నిర్మాణం ఎపుడు స్టార్ట్ అవుతుందో. ఎపుడు పూర్తి అవుతుందో ఇంకా ఎవరికీ తెలియదు. భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు.

కేంద్రం నుంచి కొన్ని అనుమతులు కూడా రావాల్సి ఉంది. విషయం ఇలా ఉంటే తాము 2002లో విశాఖ ఎయిర్ పోర్టునకు ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా లేఖ రాయడం మాత్రం విశేషంగా చూడాలి. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం చూస్తే 800 కోట్ల రూపాయలు అని అంటున్నారు. అంటే ఇంతటి ఖరీదైన భూములను రాష్ట్రప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని కోరుతోంది.

తమకు ఇక పైన విశాఖ ఎయిర్ పోర్టు అభివృద్ధి విషయంలో పెద్దగా ఫొకస్ లేనందువల్ల ఆ భూములను ఇస్తే వాటిని ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తామని కూడా రాష్ట్రం చెబుతోంది అంటున్నారు. ఈ భూములలో ఏరో సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏదో రాష్ట్రానికి ఉంది అంటున్నారు. అయితే నేవీ కంట్రోల్ మొత్తం ఉన్న ఆ పరిసర ప్రాంతాలలో ఇలంటివి ఆచరణ సాధ్యం కాదని కూడా అంటున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వేరే ఇతర అవసరాలకు అయినా ఉపయోగించుకోవాలని చూస్తోంది అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి కేంద్రానికి ఇచ్చిన భూములను వెనక్కి ఇవ్వడం అంటే అది కుదిరే వ్యవహారం కానే కాదని అంటున్నారు. ఎందుకంటే దాని వెనక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుందని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కేంద్రంతో గుడ్ రిలేషన్స్ ఏపీ సర్కార్ కి ఉన్నాయి కాబట్టి ఈ భూములను వెనక్కి ఇచ్చినా  ఇవ్వవచ్చు. మరి అక్కడ ఏపీ సర్కార్ ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీని  క్రియేటివిటీ  చేస్తుందో చూడాలి. మొత్తానికి విశాఖ ఎయిర్ పోర్ట్ అనంది గతమన్నది ప్రభుత్వ వర్గాలు ఫిక్స్ అయినట్లుగానే కనిపిస్తోంది.
Tags:    

Similar News