కట్టుకున్న భార్య శృంగారానికి నో చెబితే..? భర్త బలవంతంతోనో.. మాటలు పడలేక సెక్స్ కు ఓకే చెబితే..? భర్తతో శారీరక సంబంధానికి భార్య సిద్ధంగా లేనని చెబితే..? భార్యాభర్తలు ఇద్దరు తమకు నచ్చనప్పుడు శారీరక సంబంధానికి నో చెప్పే హక్కు ఉంటుందా?
ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీ హైకోర్టు తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. భర్త కోరినప్పుడు భార్య శృంగారానికి నో చెబితే ఏమవుతుందన్న అంశంతో పాటు.. భార్య ఇష్టం లేకుండా భర్త సెక్స్ చేస్తే అది కాస్తా కచ్ఛితంగా రేప్ అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళలా భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందన్న అర్థం కాదని.. వైవాహిక జీవితంలో భార్యభర్తలు ఇద్దరూ తమకు నచ్చనప్పుడు శారీరక సంబంధాలకు నో చెప్పే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది.
భర్త అడిగినప్పుడల్లా ఓకే అనాల్సిన అవసరం లేదని.. భార్య సమ్మతితోనే శృంగార సంబంధాన్ని భర్త కలిగి ఉండాలని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్.సి. హరిశంకర్ పేర్కొన్నారు. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతం చేయటం.. భయపెట్టటం లాంటి వాటినే నేరాలుగా చూడాలని.. అలా లేనప్పుడు నేరంగా చూడలేమని వాదిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదనల్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
లైంగిక దాడి కోసం బలవంతం పెట్టారా?.. గాయాలు అయ్యాయా? లాంటి వాటిని చూసే పరిస్థితి ఇప్పుడు లేదని.. రేప్ అనే పదానికి నిర్వచనం ఇప్పుడు మారిందని కోర్టు పేర్కొంది.
బలవంతం చేసి శృంగారం చేయటమే రేప్ కాదని.. ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి శృంగారంలో పాల్గొనాలని చెప్పటం.. గృహవవసరాలు.. పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయొచ్చని.. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య శృంగారానికి ఒప్పకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టొచ్చని పేర్కొంది.
గృహహింస నిరోధక చట్టం.. వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం.. వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్న నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాదని చెప్పే సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. శృంగారం భార్య అనుమతి.. ఇష్టంతోనే చేయాలే తప్పించి.. భయపెట్టి.. బెదిరించి.. బలవంతంగా చేయటం నేరమన్న విషయాన్ని ప్రతి భర్తా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సుమా.