పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించే పనికి భారత్ నడుం బిగించింది. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున నిర్వహించిన మెరుపుదాడులపై భారత సర్కారు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా చెప్పటంతో పాటు.. పెద్ద సంఖ్యలో ఉన్న జైషే ఉగ్రవాదుల్ని వైమానిక దళాలు జరిపిన దాడుల్లో హతమార్చినట్లుగా విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు.
తాజాగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో వందలాది ఉగ్రవాద శిబిరాలుఉన్నాయని..కచ్ఛితమైన సమాచారంతో ఉగ్ర శిబిరాలపై దాడులు చేసినట్లుగా వెల్లడించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మరణించినట్లుగా ఆయన వెల్లడించారు. అంతేకాదు.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ బావమరిది మౌలానా యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ గౌరీ హతమైనట్లుగా పేర్కొన్నారు.
తాజాగా నిర్వహించిన దాడుల్లో పౌరులకు నష్టం వాటిల్లకుండా.. టార్గెట్ మిస్ కాకుండా దాడులకు పాల్పడినట్లుగా చెప్పారు. డ్రోన్ కెమెరాల సాయంతో దాడులు చేసినట్లుగా చెప్పిన విజయ్ గోఖలే.. జైషే మహ్మద్ సంస్థ కోలుకోలేని రీతిలో దెబ్బ తీసినట్లుగా చెప్పారు.
రానున్న రోజుల్లో మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయన్న సమాచారం ఉందని.. అలాంటివి చోటు చేసుకోకుండా ఉండటానికి వీలు లేకుండా తాజా మెరుపుదాడులకు పాల్పడినట్లుగా చెప్పారు. పాకిస్థాన్ కేంద్రంగా జైషే ఉగ్రవాద సంస్థ కీలకంగా పని చేస్తుందని.. బహవల్ పూర్ కేంద్రంగా జైషే ఉగ్రవాద సంస్థ వరుస దాడులకు పాల్పడుతున్న విషయాన్ని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత జైషే మీద చర్యలు తీసుకోవాలని పాక్ కు చెప్పినా.. ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
పాక్ లోని ఉగ్ర సంస్థలపై దాడులు చేస్తామంటూ భారత్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దాయాది దేశాన్ని కోరారు. ఉగ్రవాదులపై మెరుపుదాడుల వివరాల్ని వెంటనే వెల్లడించటమే కాదు.. తాము దాడులకు పాల్పడటానికి కారణం ఏమిటన్న విషయాన్ని ప్రపంచానికి భారత్ స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.