రోగాన్ని మర్చిపోయి కేటీఆర్ తో సెల్ఫీలకు పోటీ పడ్డారట

Update: 2021-06-05 02:30 GMT
వారంతా కొవిడ్ తో బాధ పడుతున్నారు. ఓపక్క వేధించే రోగం.. మరోవైపు ఎవరిని కలవకుండా ఆసుపత్రిలో ఉన్న వేళ.. ఎప్పుడెప్పుడు ఆసుపత్రి నుంచి బయట పడతామన్నట్లుగా ఉన్న వారు.. తమ బాధల్ని.. ఆలోచనల్ని పక్కన పెట్టేసి.. ఉరిమే ఉత్సాహంతో వ్యవహరించిన వైనం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ ను అనుకోని రీతిలో చోటు చేసుకున్న సీన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ టిమ్స్ ను సందర్శించారు. దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రి ప్రాంగణంలో గడిపిన ఆయన.. కొవిడ్ వార్డుల్ని సందర్శించారు. ఈ సందర్భంగా బెడ్ మీద ఉన్న వారంతా.. మంత్రి కేటీఆర్ ను చూసినంతనే సరికొత్త ఉత్సాహానికి గురయ్యారు. అప్పటివరకు నీరసంగా బెడ్ మీద పడుకున్న వారంతా.. లేచి ఆయనకు వెల్ కం చెప్పటమే కాదు.. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు.

అంతేకాదు.. తమతో మాట్లాడేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వారి ఉత్సాహాన్ని చూసిన ఆయన.. వారికి మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ఓకే చెప్పారు.కొవిడ్ రోగుల పరామర్శకు వచ్చిన కేటీఆర్.. వారు కోరినట్లే సెల్ఫీలు దిగి వారిలోకొత్త విశ్వాసాన్ని నింపటమే కాదు.. తామంతా పేషెంట్లమన్న భావనను మర్చిపోయేలా చేశారని చెప్పాలి.
Tags:    

Similar News