జ‌గ‌న్ అంతుబ‌ట్ట‌టం లేద‌ట‌!

Update: 2019-07-30 04:34 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి క‌మ్ త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య‌. అజాత‌శ‌త్రువుగా అంద‌రి నోట అనిపించుకునే ఆయ‌న‌.. త‌న తీరుకు భిన్నంగా వ్యాఖ్య‌లు చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేలా వ్య‌వ‌హ‌రించారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న అంతు ప‌ట్ట‌ని రీతిలో ఉంద‌ని.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌టంలో ఆయ‌న ఇంకా నేర్చుకోవాల‌ని వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ఒక పుస్తకావిష్క‌ర‌ణ స‌భ‌కు హాజ‌రైన రోశ‌య్య‌.. జ‌గ‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత రోశ‌య్య‌ను ముఖ్య‌మంత్రిని చేస్తూ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. త‌ర్వాతి కాలంలో  రోశ‌య్య‌కు.. జ‌గ‌న్ కు మ‌ధ్య విభేదాలు పొడ‌చూపిన‌ట్లుగా చెబుతారు.

జ‌గ‌న్ మ‌న‌సు గాయ‌ప‌డేలా రోశ‌య్య తీరు ఉండేద‌న్న మాట‌ను కొంద‌రు.. కాదు.. రోశ‌య్య‌ను హ‌ర్ట్ చేసేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెప్పుకునే వారు లేక‌పోలేదు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ పై త‌న‌కున్న కినుకును రోశ‌య్య త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో బ‌య‌ట‌పెట్టారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మంచి మాట‌కారి అయిన రోశ‌య్య‌.. జ‌గ‌న్ ను నేరుగా త‌ప్పు ప‌ట్ట‌న‌ప్ప‌టికీ.. కొన్ని అంశాల మీద త‌న‌కున్న అసంతృప్తిని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.

సీఎం జ‌గ‌న్ తెలివైనోళ్ల‌ని.. ఆయ‌న ఆలోచ‌న ఏమిటో తెలీటం లేద‌న్న రోశ‌య్య‌.. కేంద్రంతో స‌ఖ్య‌త‌గా లేర‌ని.. రాష్ట్రంలోని ఇత‌ర ప‌క్షాల‌తో క‌లిసి న‌డ‌వ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హోదా గురించి నోరు ఎత్త‌కుండా.. మోడీ స‌ర్కారుకు గులాంగిరి చేస్తాన‌ని.. వారేం చెబితే అది చేస్తాన‌ని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని ప‌క్క‌న పెట్టేస్తాన‌ని చెబితే జ‌గ‌న్ కు కేంద్రం నుంచి ద‌న్ను ల‌భిస్తుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడితే కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండ‌లేద‌న్న మ‌ర‌క రోశ‌య్య లాంటోళ్లు వేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ప్ర‌శ్న‌. రాష్ట్ర ఆర్థిక స్థితిపై రోశ‌య్య చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఖ‌ర్చులు త‌గ్గించుకొని.. పొదుపు పాటించాల్సి ఉంద‌ని.. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న మాట‌ను చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓవ‌ర్ డ్రాఫ్ట్ లేకుండా ముందుకెళ్ల‌టం సాధ్యం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆర్థిక అంశాల‌కు సంబంధించి రోశ‌య్య మాట‌ల్ని సూచ‌న‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఏది ఏమైనా.. జ‌గ‌న్ పై త‌న‌కున్న గుర్రును రోశ‌య్య త‌న వ్యాఖ్య‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News