పార్ల‌మెంటులో కుప్ప‌కూలిన మాజీ మంత్రి

Update: 2017-01-31 09:35 GMT
పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయిన మొద‌టిరోజే క‌ల‌క‌లం రేగింది. కేర‌ళ‌కు చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ఈ అహ్మ‌ద్ ఇవాళ పార్ల‌మెంట్‌ లోనే కుప్ప‌కూలారు. బ‌డ్జెట్ సెష‌న్ ప్రారంభ‌మైన కాసేప‌టికే, రాష్ట్ర‌ప‌తి ప్రసంగిస్తున్న స‌మ‌యంలో అహ్మ‌ద్ ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే స్ట్రెచ‌ర్‌ పై బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. కేర‌ళ నుంచి లోక్‌ స‌భ‌కు అహ్మ‌ద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వంలో విదేశాంగ శాఖ స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇదిలాఉండ‌గా... ఈ ఏడాది ఆర్థిక స‌ర్వే నివేదిక‌ను ఇవాళ పార్ల‌మెంట్‌ లో ప్ర‌వేశ‌పెట్టారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగిన ప్ర‌భావాల‌పై ఆర్థిక స‌ర్వేలో వెల్ల‌డించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక‌నామిక్ స‌ర్వే నివేదిక‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ వార్షిక సంవ‌త్సరం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా ఉంద‌న్న అంశంపై ఆర్థిక స‌ర్వే నివేదిక వెల్ల‌డిస్తుంది. ఆర్థిక స‌ర్వే త‌ర్వాతే రేపు సాధార‌ణ బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ప్ర‌భుత్వం ఎటువంటి అంశాల‌కు ప్రాముఖ్య‌త ఇస్తుంద‌న్న విష‌యం ఆర్థిక స‌ర్వే ద్వారా తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన‌ అభిప్రాయాలు ఈ నివేదిక‌లో వెల్ల‌డి అవుతాయి. ఆర్థిక సర్వేకు సంబంధించిన రిపోర్ట్ కాపీలు పార్లమెంట్ స‌భ్యుల‌కు అంద‌జేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News