ద్రోణంరాజును బలి తీసుకున్న కరోనా వైరస్

Update: 2020-10-04 16:30 GMT
కరోనా వైరస్ మరో ప్రముఖుడిని బలి తీసుకుంది. మాజీ ఎంఎల్ఏ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోయారు. ఈయనకు నెల రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. మెల్లిగా వైరస్ తగ్గిందని అనుకున్నా ఇతర అవయవాల పనితీరు పడిపోయింది. దాంతో అనారోగ్యం బాగా ముదిరిపోయింది. చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉంటు చివరకు ఈరోజు మరణించారు. ద్రోణంరాజు 2006, 2009లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎంఎల్ఏగా పనిచేశారు.

చాలా కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ ఎంఎల్ఏ చివరకు రాజకీయ భవిష్యత్ కోసమే 2019 ముందు వైసిపిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటి చేసినా ఓడిపోయారు. ద్రోణంరాజు తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఎంపిగా పనిచేశారు. పరిస్దితిలు అనుకూలిస్తే విశాఖ మేయర్ అవుదామని ద్రోణంరాజు పావులు కదుపుతున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఆయన మరణించటం పార్టీకి తీరని లోటనే చెప్పాలి.


Tags:    

Similar News