టీమిండియా రూపం మారిపోయింది.. ఇంగ్లండ్ జట్టులోకి నలుగురు ప్రధాన క్రికెటర్లు వెళ్లిపోయారు.. ఇదంతా అనూహ్యంగా జరిగింది.. అయినా టీమిండియా మైదానంలోకి దిగింది.. ఇదేంటి?
.. అని అనుకోకండి.. హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోకండి.. రాజకీయాల్లో పార్టీ మార్పిడి జంపింగ్ జపాంగ్ లలాగా.. క్రికెట్ లోనూ జట్టుకు వెన్నుపోటు పొడిచేవారున్నారా? అని ఆరా తీయకండి..
ఇదంతా ఓ తాత్కాలిక సర్దుబాటు.
గతేడాది ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో మిగిలిపోయిన చివరి, ఐదో టెస్టును ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరి టెస్టు వచ్చే నెల 1 నుంచి ప్రారంభం అవుతుంది. దీనికోసం సన్నాహంగా మన జట్టు ఇంగ్లండ్ కౌంటీ జట్టు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతోంది.
మనోళ్లు అటు ఎందుకెళ్లారు?ఈ నాలుగు రోజుల మ్యాచ్ కు ఫస్ట్ క్లాస్ గుర్తింపు లేదు. అంటే.. దాదాపు మన జిల్లా క్రికెట్ టోర్నీ స్థాయి అనుకోవచ్చు. అయితే, టీమిండియా మొత్తం ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ కావాలనభావిస్తోంది.
ఒక జట్టు తరఫున 12 మంది ఆడొచ్చు.16మందితో పర్యటనకు వెళ్లగా మరో నలుగురు మ్యాచ్ ప్రాక్టీస్ కు దూరం అవుతున్నారు. దీంతో మన పేసర్లు బుమ్రా, ప్రసిద్ధ్ క్రిష్ణ, బ్యాట్స్
మన్ చతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ లను లీసెస్టర్ షైర్ తరఫున ఆడిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రత్యర్థి జట్టు ఒప్పుకుంది.
ప్రసిద్ధ్ వికెట్ తీశాడు.. బుమ్రా క్యాచ్ పట్టాడు గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే, తొందరగా వికెట్లు కోల్పోతోంది. 24 ఓవర్లకు 81 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది.
కెప్టెన్ రోహిత్ (25), మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (21), హైదరాబాదీ హనుమ విహారీ (3), శ్రేయస్ అయ్యర్ (0) పెవిలియన్ చేరారు. శ్రేయస్ ను ప్రసిద్ధ్ ఔట్ చేయగా.. గిల్ క్యాచ్ ను పంత్ పట్టాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (13) కూడా ఔటయ్యాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కోనా శ్రీకర్ భరత్ (0) అతడికి తోడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక లీసెస్టర్ షైర్ తరఫున 5 ఓవర్లు వేసిన టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా 20 పరుగులిచ్చాడు. వికెట్ పడగొట్టలేకపోయాడు.