ల్యాగ్.. లాగ్.. స్టేషనరీ.. డెత్.. ఏందీ మాటలన్ని?

Update: 2020-04-16 01:30 GMT
కరోనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి పుట్టిన చైనాలో దాన్ని ఖతం పట్టించినట్లుగా వచ్చిన వార్తలు చాలామందిలో సంతోషాన్ని కలిగించినా.. కొత్త కేసుల నమోదు అవుతున్న వైనం షాక్ కు గురి చేసింది. దీంతో.. కరోనా ఎపిసోడ్ చైనాలో ఇంకా ముగిసిపోలేదన్న వాదన తెర మీదకు వచ్చింది. ఇంతకీ చైనా ఇప్పుడే దశలో ఉంది? భారత్ మాటేమిటి? అన్నవి ప్రశ్నలు.

సాధారణంగా వైరస్ వ్యాప్తి జరిగే వేళ.. నాలుగు దశలుగా విభజిస్తారు. అందులో వ్యాధి వ్యాప్తిని లాగ్ అంటే.. దాని పెరుగుదలను లాగ్ అంటారు. ఇదే అత్యంత ఆందోళన కలిగించే దశ. పెరుగుదల స్థిరంగా మారి కనీస సంఖ్యలో కేసులు నమోదయ్యే దశను స్టేషనరీగా అభివర్ణిస్తారు. పూర్తి స్థాయిలో వైరస్ కట్టడి దశను డెత్ గా చెబుతారు. ఇలా చూసినప్పుడు చైనా నాలుగో దశకు చేరుకున్నట్లుగా భావించారు. కానీ.. కొత్త కేసులు నమోదు అవుతుందటంతో మూడో దశలోనే ఉన్నట్లుగా తేల్చారు. నాలుగో దశకు వెళితే తప్పించి కరోనా ఖతమైనట్లు కాదన్నది వాదన.

ఇదిలా ఉంటే.. మన దేశానికి వస్తే.. ప్రస్తుతం రెండో దశలో ఉన్నట్లుగా చెప్పాలి. మార్చి నాలుగున రెండో దశలోకి అడుగు పెట్టినట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందన్న వాదనను పలువురు వినిపిస్తున్నాయి. ఇది సరికాదని.. ర్యాండమ్ టెస్టు చేయిస్తే తప్పించి.. కేసులు తక్కువగా ఉండటాన్ని సానుకూలతగా చెప్పుకోవటం సరికాదని తప్పు పట్టేవారు లేకపోలేదు.

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే.. భారత్ లో లాక్ డౌన్ ను పొడిగించటం.. భౌతిక దూరాన్ని పాటించటం లాంటి చర్యలతో కరోనా కట్టడికి అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల కారణంగా రెండో దశ నుంచి మూడో దశకు వేగంగా షిఫ్ట్ కావటంతో పాటు.. నాలుగో దశకు చేరుకోవచ్చంటున్నారు. అయితే.. మూడో దశకు వెళ్లినా.. నాలుగోదశ అంత తేలికైన విషయం కాదని.. నిరంతరం కట్టడి.. నియంత్రణను పాటిస్తే తప్పించి నాలుగో దశకు చేరుకునే అవకాశం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News