జగన్ సంచలనం: ఏపీలో కర్ఫ్యూ, ఉచిత కరోనా వ్యాక్సిన్

Update: 2021-04-23 13:21 GMT
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్లు నిండిన ఏపీ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండి అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఖర్చుతోనే ఏపీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 18-45 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 2.04 కోట్ల మందికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని తెలిపారు. ఇందుకోసం 1600 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కేటాయించారు.

కరోనా వ్యాక్సిన్ల కోసం సీఎం జగన్ సమీక్షలో భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లతో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కోరారు. వారు అంగీకరించడంతో రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తసీుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పనిచేయవని స్పష్టం చేసింది. దుకాణాలు, ప్రజారవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేయనున్నారు. ఆస్పత్రులు, పెట్రోల్ బంక్ లు, మీడియా, ఫార్మసీలు లాంటి అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చారు.
Tags:    

Similar News