బర్త్ డే బాయ్ ను కొట్టి చంపేసిన ఫ్రెండ్స్.. మద్యం మత్తులో దారుణం

Update: 2022-06-02 04:16 GMT
రోజంతా పనుల్లో బిజీగా ఉండే ఆ స్నేహితులు రాత్రి కలుసుకునేవారు. ఆ తరువాత సిగరెట్లు, మద్యం తాగుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తిది బర్త్ డే వచ్చింది. దీంతో అతడిని తోటి స్నేహితులు పార్టీ అడిగారు. కాదనలేక రాత్రి లిక్కర్ తో కలిసి పార్టీ అరేంజ్ చేశాడు.

అయితే పార్టీకి వచ్చిన స్నేహితులు అతడినే హత్య చేశారు. అప్పటి వరకు తనతో కలిసున్న స్నేహితులే ఆ సమయంలో యములయ్యారు. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఇలా బర్త్ డే పార్టీ చేసుకుంటున్న వారిలో దడ పుడుతోంది. ఇంతకీ అతని స్నేహితులు బర్త్ డే బాయ్ ని ఎందుకు హత్య చేసినట్లు..?

తమిళనాడులోని చెన్నై సిటీ సమీపంలోని అలమడి కృష్ణానగర్ లో మారీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. మారితో పాటు కొందరు స్నేహితులు లోకేశ్వరన్, రామమూర్తి తదితరులు కూడా డిగ్రీ పూర్తి ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే రోజంతా పనుల్లో నిమగ్నమైన  రాత్రి అందరూ కలుసుకుంటారు. సిగరెట్లు, మద్యం తాగుతూ రిలాక్స్ అవుతారు. అయతే మారీ బర్త్ డే సందర్భంగా ఆయనను తోటి స్నేహితులు పార్టీ అడిగారు. దీంతో స్నేహితుల మాటను కాదనలేక వారికి లిక్కర్ పార్టీని అరెంజ్ చేశాడు.

బర్త్ డే సందర్భంగా స్నేహితులు కేక్ తెచ్చారు. అప్పటికే కొన్ని రౌండ్ల పాటు లిక్కర్ పార్టీ కొనసాగింది. ఆ తరువాత రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి మారి ఫేస్ కు రాశారు. ఇలా సరదాగా గడుపుతున్న సమయంలో తన స్నేహితుల్లో కొందరు మారి తలపై గట్టిగా కొట్టారు. మారీ తలపై దెబ్బ బలంగా పడడంతో ఆయన అక్కడే కుప్పకూలాడు. అయితే మిగతా వారు ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మారీ ప్రాణాలు వదిలినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

తన బర్త్ డే పార్టీని స్నేహితులతో ఎంజాయ్ చేద్దామనుకున్న మారిని తోటి స్నేహితులే హత్య చేయడం కలకలం రేపింది. దీంతో స్నేహితుతలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే వారి గుండెల్లో దడ పుడుతోంది. అయతే మారీ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ డబ్బులు బాగా సంపాదించినట్లు సమాచారం.

దీంతో డబ్బు కోసమే అతన్ని హత్య చేశారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదీ ఏమైనా బర్త్ డే పార్టీల్లో జాగ్రత్తగా చేసుకోవాలని అనుమానితులతో కలిసి వేడుకలు చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News