క‌రోనా చికిత్స నుంచి.. ఈ మందులన్నీ ఏరిపారేశారు!

Update: 2021-06-14 15:30 GMT
స్ప‌ష్టంగా చెప్పుకోవాలంటే క‌రోనాకు ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేదు. మ‌రి, ఆసుప‌త్రుల్లో ఎలాంటి చికిత్స‌ చేస్తున్నారు? అన్న‌ప్పుడు చాలా లెక్క‌లు బ‌య‌టికి వ‌స్తాయి. పేషెంట్ల కండీష‌న్ బ‌ట్టి.. దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తూ వ‌చ్చారు. ఇంకా క్లియ‌ర్ గా చెప్పాలంటే.. క‌రోనా తీవ్ర‌త ఏంట‌న్న‌ది మొద‌ట్లో ఎవ‌రికీ తెలియ‌దు కాబ‌ట్టి.. త‌మ‌కున్న అవ‌గాహ‌న మేర‌కు, అనుభ‌వం మేర‌కు వైద్యులు మందులు ఇస్తూ వ‌చ్చారు.

ఇన్నాళ్ల త‌ర్వాత‌.. వేలాది మంది రోగుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత వారికి ఒక క్లారిటీ రావ‌డం మొద‌లైంది. దాని ప్ర‌కారం.. ఎలాంటి మందులు అవ‌స‌రం? ఏది అన‌వ‌స‌రం? ఏది మేలు చేస్తుంది? ఏది ఆరోగ్యానికి న‌ష్టం చేస్తుంది? అనే అంశాల‌పై క్ర‌మంగా స్ప‌ష్ట‌త రావ‌డం మొద‌లైంది. ఆ మేర‌కు మందుల వినియోగంలోనూ మార్పులు చేస్తూ వ‌స్తున్నారు.

క‌రోనా తొలిద‌శ‌ మొద‌ట్లో.. మ‌లేరియాకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ స‌రైన మందుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత దాంతో ఉప‌యోగం లేద‌ని క‌రోనా మందుల జాబితా నుంచి దాన్ని తొల‌గించారు. నెల రోజుల కింద‌టి వ‌ర‌కు అత్యంత కీల‌క‌మైన ఔష‌ధంగా ప‌రిగ‌ణించిన రెమ్ డెసివ‌ర్ ను కూడా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ.. క‌రోనా ప్రొటోకాల్ నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఇవే కాదు.. ఇంకా చాలా మందులు ఉన్నాయి.

ఐవ‌ర్ మెక్టిన్‌, ఫావిపిర‌విర్‌, ప‌లు స్టెరాయిడ్ల‌ను కూడా కొవిడ్ ట్రీట్మెంట్ నుంచి ఏరిపారేశారు. మొద‌ట్లో తెగ ప్ర‌చారంలోకి వ‌చ్చిన ప్లాస్మా తెర‌పీని కూడా తీసేశారు. యాంటీ బ‌యాటిక్స్, స్టెరాయిడ్స్ అధిక వినియోగం ఆరోగ్యంపై పెను ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో ఇవ‌న్నీ మెల్ల మెల్ల‌గా తీసేశారు.

ఇవ‌న్నీ తొల‌గించిన త‌ర్వాత మ‌రి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా కొన‌సాగిస్తున్నార‌న్న‌ప్పుడు.. రోగుల హెల్త్ కండీష‌న్ బ‌ట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న‌వారికి పారాసిట‌మాల్ తోనే కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాస్త ఎక్కువ‌గా ఉన్న‌వారికి స్టెరాయిడ్స్, యాంటీ బ‌యాటిక్స్ త‌క్కువ‌గా ఇస్తూ.. ఆక్సీజ‌న్ వినియోగిస్తున్నారు. అత్య‌వ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే రెమ్ డెసివ‌ర్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా.. క‌రోనా ట్రీట్మెంట్లో చాలా మార్పులు వ‌చ్చాయి. క‌రోనాను త‌రిమికొట్టే క్ర‌మంలో ఆరోగ్యం నాశ‌నం కాకుండానే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News