పొంగులేటి కి పోలీసుల రాచమర్యాదలు.. కారణమేంటి.

Update: 2020-01-06 09:48 GMT
భర్త లేని మహిళ ను, అధికారం లేని రాజకీయ నాయకుడిని ఈ సమాజం చీప్ గా చూస్తుందంటారు. ఇలాంటి నేతలను కింది స్థాయి కార్యకర్తలు, ప్రజలు ఎవరూ పట్టించుకోరు రారు. అందుకే ఎప్పుడూ అధికారంలో ఉండాలని నేతలు ఉబలాటపడుతారు. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలోకి మారుతారు.. ఎన్నికల్లో గెలవడానికి ఆపసోపాటు పడుతారు.

2014లో వైసీపీ తరుఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఐదేళ్లు రాజకీయ అధికారం అనుభవించారు. కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి అనతికాలంలో ఖమ్మంలో ఏకుమేకులా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. తుమ్మలను కూడా ఓడించారనే టాక్ ఉంది.

అయితే 2019 ఎన్నికల్లో పొంగులేటి తీరు నచ్చక గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ పోటీచేయలేదు. అయితే అధికారం పోతే ఎవ్వరూ ఖతరు చేయరని.. తన దర్జా, హోదా తగ్గుతుందని భావించిన పొంగులేటి ఖమ్మంలో తన సామాజిక వర్గానికి చెందిన పోలీస్ బాస్ లను మచ్చిక చేసుకున్నారట.. దాని ఫలితమే ఇప్పుడు ఓడిపోయి ఏ పదవి లేకున్నా పొంగులేటికి పోలీసు భద్రత భారీగా ఉందట..

పొంగులేటి ఎంపీగా ఉన్నప్పుడే ముగ్గురు గన్ మెన్లు ఉండేవారట.. కానీ ఇప్పుడు ఏ పదవి లేని పొంగులేటి చుట్టూ ఏకంగా నలుగురు గన్ మెన్లు ఉన్నారట.. అంతేకాదు.. ఆయన కోసం పోలీసులు సమకూర్చిన పోలీస్ వాహనం కూడా ఎస్కార్ట్ గా ఉంది. ఎంపీ కూడా కాదు.. ఎమ్మెల్యే కాదు.. ఓడిన నేత ఏ పదవి లేకున్నా ఇంత సెక్యూరిటీ ఏంటి అని ఇప్పుడు నేతలు ప్రజలు మక్కున వేలేసుకుంటున్నారట.. ఇలా అధికారం లేకున్నా తనకు తెలిసిన పోలీస్ బాసుల సాయంతో హల్ చల్ చేస్తూ తాను రూలర్ అని పొంగులేటి జిల్లాలో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట..
Tags:    

Similar News