కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత.. కొన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే అందుకు భిన్నంగా ఊహించని వాతలు పెట్టించుకున్న దుస్థితి. రైల్వేల మీద మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెడతారని.. వినూత్న సౌకర్యాలు.. పథకాల్ని అమలు చేస్తారన్న అంచనాలకు భిన్నంగా.. ఉన్న రాయితీలకు కోత పెట్టిన ఘనత మోడీ సర్కారుదే.
ఏడాదికి ఒకసారి రైల్వే బడ్జెట్ లో.. కొన్ని ముఖ్య సందర్భాల్లో ఒకట్రెండు నిర్ణయాలు తీసుకునే విధానానికి మంగళం పాడుతూ.. తరచూ ప్రజల మీద భారం మోపేలా నిర్ణయాలు తీసుకుంటూ రైల్వే ప్రయాణికులకు షాకుల మీద షాకులిస్తోంది రైల్వే శాఖ. పిల్లల రిజర్వేషన్లకు హాఫ్ టికెట్ ఇచ్చే విధానానికి మంగళం పాడిన మోడీ సర్కారు పుణ్యమా అని.. రైల్వేలకు భారీ ఆదాయమే రానుందని చెబుతున్నారు.
గతంలో పిల్లలకు రైల్వేల్లోని రిజర్వేషన్ల బోగీల్లో టికెట్లు బుక్ చేస్తే.. హాఫ్ ఛార్జీ మాత్రమే వసూలు చేసేవారు. దీనికి భిన్నంగా హాఫ్ టికెట్ విధానాన్ని ఎత్తేయటంతో పిల్లలకు సైతం ఫుల్ ఛార్జీ చెల్లించాల్సిన పరిస్థితి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకూ రూ.160 కోట్ల ఆదాయం రైల్వేలకు వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ విధానంతో రైల్వేల ఆదాయం రూ.525 కోట్ల మేర వస్తుందన్న అంచనా వేస్తున్నారు.
ఇప్పుడున్నలోపాల్ని మరింతగా చక్కదిద్ది.. అధికారులు కానీ కఠినంగా వ్యవహరిస్తే మార్చిన విధానాలతో రూ.525 కోట్ల భారీ ఆదాయం రైల్వేలకు వస్తుందని చెబుతున్నారు. పిల్లలకు సైతం పెద్దల చార్జీలను వడ్డిస్తూ.. భారం మోపుతున్న రైల్వేలకు ఆదాయం రావటమేమో కానీ.. అదే స్థాయిలో భారం రైల్వే ప్రయాణికుల మీద పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.