తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గడ్డం తీస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన శపథం అందరికీ తెలిసిందే. ఆయన ప్రకటనపై అనేక సటైర్లు వచ్చాయి. ఇక అధికార టీఆర్ ఎస్ నేతలైతే ఇక జీవితంలో ఉత్తమ్ గడ్డం తీయలేరని కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ప్రకటించారు. అయితే ఇది ప్రెస్ మీట్ లోనో - పార్టీ సమావేశంలోనో కాదు. ఓ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ చెప్పిన మాట.
శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల పలకరింపులు మామూలే. సభలో ప్రత్యర్థులుగా ఉంటూ ఆరోపలు - ప్రత్యారోపణలు చేసుకునే నేతలు.. లాబీల్లో మాత్రం అవన్నీ మరచిపోయి సరదాగా కలిసిపోయి పరాచకాలాడుకుంటుంటారు. సరిగ్గా ఇలాగే కలిసిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య శుక్రవారం ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
శుక్రవారం అసెంబ్లీ లాబీలో దయాకరరావు - ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుపడ్డారు. ఉత్తమ్ లాబీలో వస్తుండగా, ఎర్రబెల్లి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా దయాకరరావు.. ఉత్తమ్ ను "అన్నా గడ్డం ఎప్పుడు తీస్తావ్?" అని ప్రశ్నించారు. దానికి 2019లో తీస్తాను అని ఉత్తమ్ బదులిచ్చారు. తదుపరి ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, అప్పటిదాకా గడ్డం తీయబోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాతే షేవింగ్ చేయించుకుంటానని ఉత్తమ్ చెప్పారు.