వైసీపీలో పోటా పోటీ 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌'.. ఎక్క‌డంటే..!

Update: 2022-11-18 09:30 GMT
వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ చెప్పిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని హిట్ చేసేందుకు.. కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇదే కార్య‌క్ర‌మాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేం దుకు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ్గంలో మ‌రికొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా.. ర‌క్ష‌ణ‌నిధి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు.

పైగా.. ఇక్క‌డ టీడీపీకి ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన నాయ‌కుడు లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జ‌వ‌హ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేశారు. దీంతో టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు లేకుండా పోయార నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. ర‌క్ష‌ణ‌నిధి కూడా.. త‌న‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌లేద‌ని.. నిరాశ‌లో ఉన్నారు. అయినా.. ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. అయితే, ఇప్పుడు ఇక్క‌డే వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఏర్ప‌డింది.

త‌న‌కు ఈ సీటు ఇవ్వాలంటూ.. మాజీ మంత్రి కోనేరు రంగారావు మ‌న‌వ‌రాలు, లిడ్ క్యాప్‌ కార్పొరేష‌న్  డైరెక్ట‌ర్ కోనేరు స‌త్య‌ప్రియ కోరుతున్నారు. ఇప్ప‌టికే.. రెండు సార్లు ఆమె అర్జీలు కూడా స‌మ‌ర్పించారు. మ‌రోవైపు.. అధిష్టానం ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌ముందే.. ఆమెప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. తానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అనేది వీళ్లే చేయాల‌నే నిబంధ‌న లేదు.

దీంతో దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకున్న స‌త్య‌ప్రియ‌.. వారానికి రెండు సార్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. త‌న‌ను గెలిపించాల‌ని.. ఆమె బ‌హిరంగంగానే చెబుతున్నారు. మ‌రోవైపు..

ఈ ప్ర‌చారాన్ని కానీ, ఆమెను కానీ.. ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి అడ్డు కోక‌పోగా.. దీనిపై అస‌లు ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇక్క‌డ స‌త్య‌ప్రియ పేరు వినిపిస్తోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు క‌నుక పాజిటివ్ టాక్ వ‌స్తే.. ర‌క్ష‌ణ‌నిధి సీటును వ‌దులుకోక త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News