తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ మహాకూటమి పేరుతో ఏకతాటిపైకి రాగా, టీఆర్ ఎస్ అంతర్గత కుమ్ములాటలతో సతమమతం అవుతోంది. ఈ రాజకీయ వేడిలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. అపద్ధర్మ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావుపై ఆయన తనయుడైన మంత్రి కే తారక రామారావుపై పోటీ చేసే అభ్యర్థుల అంశంలో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై ప్రజాగాయకుడు గద్దర్ - కేటీఆర్ పై ప్రజాగాయని విమలక్క పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఎం సారథ్యంలోని తెలంగాణ సామాజిక - ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీ-మాస్) చైర్మన్ కంచ ఐలయ్య చెప్పారు. స్వతంత్ర అభ్యర్ధులుగానే బరిలో నిలుస్తారని చెప్పారు. కేసీఆర్ - కేటీఆర్ లను ఓడించి - తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.
ఎన్నికల నేపథ్యంలో తమ వైఖరిని ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గద్దర్ - విమలక్క అనేక త్యాగాలు చేశారని - చాకలి ఐలమ్మ - దొడ్డి కొమురయ్య వారసులుగా వీరు నిలుస్తారని అన్నారు. వారి పోరాటాలతో పోల్చితే కేసీఆర్ చేసింది శూన్యమని - ఆయన కొడుకు కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని అధికారాన్ని అనుభవించాలని తాపత్రయ పడుతున్నాడని విమర్శించారు. గద్దర్ - విమలక్క ఎన్నికల పోటీకి అంబేద్కర్ - పూలే సంఘాలు - ప్రజా సంఘాలు - కవులు - రచయితలు - విప్లవ సంఘాలు సహా సకల ప్రజానీకం మద్దతు తెలపాలని కోరారు. గద్దర్ - విమలక్క పోటీలో ఉన్న చోట కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ సహా ఏ రాజకీయపార్టీ కూడా తమ అభ్యర్ధుల్ని ఎన్నికల్లో నిలబెట్టకుండా వారికి మద్దతు తెలపాలని కంచ ఐలయ్య విజ్ఞప్తి చేశారు. ఈ పోటీకి సీపీఎం - బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పటికే మద్దతు తెలిపాయని చెప్తూ...వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయ సాధన కోసం టీ-మాస్ ఏర్పడిందని - దానిలో భాగంగా గతంలోనే మ్యానిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. జనాభాప్రాతిపదికన ఎన్నికల్లో సీట్లు కేటాయించాలనే తమ డిమాండ్‌ను అమలు చేసేందుకు బహుజన లెఫ్ట్ఱ్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్) అంగీకరించిందని, మిగిలిన రాజకీయపార్టీలు కూడా తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.