ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాకిచ్చారు. విపక్ష నేతలా నిరసనకు దిగారు. అదికూడా సాక్షాత్తు చంద్రబాబు ముందే ఆయన నిరసనకు దిగడంతో చంద్రబాబు షాక్ తిన్నారు. అయితే.. తనకు వ్యతిరేకంగా కాకుండా అధికారులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నిరసన తెలపడంతో తేరుకుని అధికారులకు చీవాట్లు పెట్టారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిదిలోని కృష్ణా కరకట్టలపై టీడీపీ వ్యవస్థాపకుడు - దివంగత సీఎం నందమూరి తారకరామారావు హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. దాదాపు కోటి రూపాయలతో అప్పట్లో ఆ స్థలాల్లో పక్కా ఇళ్లను టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. తాజాగా ఈ ఇళ్లు కృష్ణా పుష్కరాల సందర్భంగా చేస్తున్న సుందరీకరణ పనులకు అడ్డుగా వస్తున్నాయన్న భావనతో ఆ ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే వాటిని కూల్చేయడానికి పలుగు పార తీసుకుని జనం నిద్ర లేవకముందే ఇటీవల ఓ రోజు అక్కడికి చేరుకున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు వెంటనే స్పందించి హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని అధికారులు చెప్పడంతో గద్దె ఫోనందుకున్నారు. లైన్లోకి వచ్చిన బెజవాడ మునిపిసల్ కార్పొరేషన్ కమిషనర్ వీరపాండ్యన్ కూడా ఇదే సమాధానం ఇచ్చారు. అయితే గద్దె ఆగ్రహంతో అప్పటికప్పుడు ఇళ్ల కూల్చివేతను తాత్కాలికంగా వాయిదా వేసిన అధికారులు వెనక్కెళ్లారు.
కానీ.. అక్కడితో ఆగని గద్దె విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. తనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలను తీసుకెళ్లి చంద్రబాబు ముందు నిరసన తెలిపారు. ‘‘మనం స్థలాలిచ్చి మన ప్రభుత్వమే కట్టించిన ఇళ్లను మనమే కూల్చివేస్తే ఎలా?’’ అని చంద్రబాబును ప్రశ్నించారు. దంతో చంద్రబాబు సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పకుండా పేదల ఇళ్ల కూల్చివేతకు ఎలా వెళతారంటూ చంద్రబాబు ప్రశ్నించడంతో పాటు ఇంకోసారి ఇలా చేయొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.