గనుల తవ్వకాలకు సంబంధించి అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి హయాంలో పెను వివాదాలే జరిగాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పలు చోట్ల అక్రమ తవ్వకాలు సాగించిందన్న ఆరోపణలతో గాలి జనార్ధనరెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు.
ఆ తర్వాత అది వార్తల్లో లేకుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరు వినిపిస్తోంది.అంటే మైనింగ్ ప్రాసెస్ ను షురూ చేయనున్నారు అని తేలిపోయింది. ఇందుకు సంబంధించిన గాలి ఇటుగా మళ్లింది.
ఆ విధంగా గాలి జనార్దన రెడ్డి (ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత) సంబంధిత పావులు కదుపుతున్నారు అన్నది ఓ ప్రాథమిక వివరం. అంటే మళ్లీ ఇప్పుడు ఆంధ్రాలో మైనింగ్ ప్రాసెస్ ను షురూ చేసి తద్వారా వైసీపీ పెద్దలు కొన్ని కొత్త వివాదాలనో లేదా కొన్ని పాత వివాదాలతోనో సంచలనం సృష్టించనున్నారని విపక్షం అంటోంది.
ఎందుకంటే ఆ రోజు మైనింగ్ ప్రాసెస్ కు సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల గురించి ఎంతటి వివాదం జరిగిందో అందరికీ తెలుసంటోంది ప్రతిపక్షం.! మళ్లీ మైనింగ్ పై కన్నేశారని... మైనింగ్ ప్రాసెస్ ను షురూ చేసేందుకు సుప్రీం కోర్టు ద్వారా సమ్మతి పొందేందుకు గాలి అండ్ కో ప్రయత్నాలు చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్షం విమర్శలు చేస్తోంది.
అంటే మూడేళ్లూ సైలెంట్ గా ఉండి, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఆ రోజు ఎన్నికలకు సంబంధించి కానీ లేదా జగతి సంస్థలకు సంబంధించిన ఫండ్ కానీ సమకూర్చి, వైఎస్సార్ పెద్ద కొడుకు పాత్రలో గాలి జనార్దన రెడ్డి ఎంతో మేలు చేశారని, కేవలం క్విడ్ ప్రోకో లో భాగంగానే ఈ తరహా మేలు చేసి ఉన్నారని అప్పట్లో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది కదా అని ప్రతిపక్షాలు అంటున్నాయి.
రిటర్న్ గిఫ్ట్ కింద మళ్లీ ఆయనకు హెల్ప్ చేయడానికి ఈ పని మొదలుపెడుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. క్రమంలో ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు సంబంధిత అధికార ప్రభుత్వం సమ్మతించింది అని, ఇక వాళ్లకు ఏ లోటూ ఉండదని విపక్షం సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోంది.