రాజకీయ నాయకులు.. పారిశ్రామికవేత్తల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ.. అధికారికంగా వచ్చే ఆదాయమే భారీగా ఉండటం అంత చిన్న విషయం కాదు. తెలుగుదేశం పార్టీ ఎంపీ.. పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ వ్యక్తిగత ఆదాయం చూస్తే కళ్లు తిరగాల్సిందే. అధికారికంగా ఆయన వార్షిక ఆదాయం రూ.33.59కోట్లు. అంటే.. నెలకు కాస్త అటూఇటూగా రూ.3కోట్లు అన్న మాట.
ఎంపీగా జీతం కానీ.. అమర్ రాజా బ్యాటరీ సంస్థకు ఎండీ హోదాలో ఆయన పొందిన వార్షిక ఆదాయం రూ.33.59కోట్లుగా తేల్చారు. తెలుగువారిలో అత్యధిక వ్యక్తిగత ఆదాయం పొందిన నేతగా జయదేవ్ పేరు చెబుతున్నారు. ఆయన ఆదాయంలో రూ.2కోట్లు జీతంగానూ.. లాభాల్లో కమిషన్ రూపంలో రూ.31కోట్ల మేర ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. ఇక.. ఆయన తండ్రి రామచంద్రనాయుడికి రూ.20కోట్ల మేర కమిషన్ పొందినట్లు చెబుతున్నారు. పేరులో ప్రిన్స్ అని పిలిపించుకునే జయదేవ్ బావమరిదికి మహేశ్ బాబు కూడా బావగారంతా వార్షిక ఆదాయం ఉండదేమో..?