గల్లా జయదేవ్ కంపెనీకి హైకోర్టులో రిలీఫ్

Update: 2021-05-06 08:44 GMT
కాలుష్యాన్ని కారణంగా చూపి ఏపీ సర్కార్..  గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యామిలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత బ్యాటరీస్ సంస్థ అమరరాజా కంపెనీని మూసివేయించిన సంగతి తెలిసిందే.. దీనిపై హైకోర్టుకు ఎక్కిన అమరరాజా కంపెనీకి  గురువారం ఊరట లభించింది.

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను సంస్థ పాటించడం లేదని ఆరోపిస్తూ కంపెనీని మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అమరరాజా బ్యాటరీస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందింది.

గురువారం విచారించిన హైకోర్టు  ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. అమరరాజను మూసివేయడానికి వీల్లేదని ఏపీ సర్కార్ కు ఆదేశాలిచ్చింది.

ఇక మరో పిటీషన్ లో రాష్ట్రంలో కోవిడ్ 19 కేసులను నిర్వహించడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. రోగులకు చికిత్స.. వ్యాక్సిన్ అందించడంలో అట్టడుగు స్థాయిలో  ప్రభుత్వ ఉందని.. ప్రభుత్వ యంత్రంగాలు విఫలమయ్యాయని కోర్టు అభిప్రాయపడింది.

ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని.. వెంటనే  తనిఖీ చేసి, విఫలమైన వ్యవస్థను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో విఫలమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  కోర్టుకు హాజరుకావాలని కోరింది.
Tags:    

Similar News