కొందరు చెప్పేది వింటుంటే నిజమా? కాదా? అన్న అనుమానం వస్తుంది. వారి బ్యాక్ గ్రౌండ్ తెలిసినవారు రకరకాల అనుమానాలు వ్యక్తంచేస్తారు. తాజాగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చెప్పిన మాటలు విన్నవారు ఆయన్ను నమ్మాలా వద్దా అనుకుంటున్నారు. తాను చిన్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశానని... బట్టల కొట్టో పనిచేశానని చెబుతుంటే జనం నోరెళ్లబెడుతున్నారు. ఆయన నేపథ్యం తెలిసినవారు ఇదంతా నమ్మశక్యంగా లేదని అంటున్నారు. కానీ, అదంతా నిజమేనట.. అయితే ఆంధ్రలో కాదు, అమెరికాలో ఆయన ఈ పనులన్నీ చేశానని చెబుతున్నారు.
ఏపీ నూతన రాజధాని అమరావతిలో యువతకు అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పిన గల్లా.. విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులకు అమరావతిలోనే మంచి అవకాశాలు దొరికేలా చేస్తామని... అమెరికా వెళ్లాల్సిన పనే ఉండదని చెప్పుకొచ్చారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని ఆయన చెప్పారు. తాను కూడా చిన్నప్పుడు కష్టపడ్డానని చెప్పారు. అమెరికాలో తాను అయిదో తరగతి చదువుకున్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశానని... ఆ తరువాత బట్టలకొట్లో పనిచేశానని చెప్పి స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నించారు. జయదేవ్ తండ్రి రామచంద్రనాయుడు పెద్ద వ్యాపారవేత్త.. ఆయన అప్పట్లోనే ఉన్నత విద్యావంతుడు.. అమెరికాలో ఉద్యోగరీత్యా ఆయన ఉన్నప్పుడు జయదేవ్ అక్కడ చదువుకునేవారు. పాపం.. ఆ సమయంలో జయదేవ్ తాను పడిన కష్టాలను చెప్పుకొచ్చారు. ఇండియాలో గవర్నమెంటు స్కూళ్లలో చదువుకునే పిల్లల కష్టాలకు అమెరికాలో అయిదో తరగతి విద్యార్థిగా జయదేవ్ పడిన కష్టాలకు పొంతన ఏమిటో ఆయనకే తెలియాలి. దీంతో ఆయన అలా చెప్తున్నప్పుడు అక్కడున్న కొందరు గల్లా జయదేవ్ వి అన్నీ సినిమా కష్టాలే అనుకున్నారట.