ఉపయోగించుకోవాలే కానీ ఈ ప్రపంచంలో పనికి రాని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ప్రతీది ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలాగే తన బావ గల్లా జయదేవ్ కు ఉపయోగపడుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్చువల్ గా తన ఎన్నికల ప్రచారానికి మహేశ్ బాబుని రమ్మని అడిగాడు గల్లా జయదేవ్. కానీ సారీ బావా అని చెప్పేశాడు మహేశ్. కానీ మహేశ్ క్రేజ్ని తనకు ఎలా ఉపయోగించుకోవాలో పక్కా బిజినెస్ మ్యాన్ అయిన గల్లా జయదేవ్ కు తెలుసు. అందుకే మహేశ్ క్రేజ్ ని యమా తెలివిగా యూజ్ చేసుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితం ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడారు గల్లా జయదేవ్. ఆయన ఇచ్చిన స్పీచ్ కి మోదీ భయపడ్డారని అందుకే.. తనని ఏం చేయకుండా తన బావమరిది అయిన మహేశ్ బాబుని టార్గెట్ చేశారని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటున్నాడు జయదేవ్. మహేశ్ పై ఐటీ దాడులు జరుగడం, జీఎస్టీ వివాదం వెనక కారణం అదే అని జయదేవ్ ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ నేత నారా లోకేష్ కూడా మహేష్ బాబు జీఎస్టీ వివాదాన్ని తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. దీనివల్ల మోదీ, కేసీఆర్, జగన్ అంతా కలిసి ఏపీకి చెందిన వాళ్లపై కక్ష కట్టారని, దాన్ని మనం ఎదుర్కోవాలని అంటే టీడీపీకి ఓట్లు వెయ్యాలని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఇది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. జీఎస్టీ వివాదాన్ని కూడా ఇలా తమకు పనికొచ్చేలా వాడుకోవడం టీడీపీ నేతలకే చెల్లిందని అందరూ అనుకుంటున్నారు.