ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా ఏ రేంజిలో ఉందో తెలిసిందే. ఎర్రచందనం డాన్ ల సత్తా కూడా ఇప్పటికే చూశాం. దేశవిదేశాల్లో నెట్ వర్కు ఏర్పాటు చేసుకుని ఇంటర్ పోల్ నోటీసులున్నా పోలీసులకు ముప్పతిప్పలు పెట్టిన డాన్ లు ఉంటున్నారు. చైనా - దుబాయి వంటి దేశాలకు చెందిన డాన్ లు - తమిళనాడు - కర్ణాటక - బెంగాల్ రాష్ట్రాల వారు ఈ మాఫియాలో ఉండగా... ఏపీలోనూ పెద్ద స్థాయి ఎర్రడాన్ లు ఉన్నారు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సిన పేరు గంగిరెడ్డి .
ఏపీ పోలీసులకు దొరక్కుండా ఇతర దేశాల్లో దాక్కుని ముప్పతిప్పలు పెట్టిన గంగిరెడ్డి మామూలోడు కాడని ఇప్పటికే లోకానికి తెలుసు. తాజాగా ఆయన పేరు పనామా పేపర్లలో కూడా ఉందని తెలుస్తోంది. దీంతో గంగిరెడ్డి సామ్రాజ్యం ఏ స్థాయికి విస్తరించిందో అనుకుంటున్నారు. పనామా పేపర్లలోని గంగిరెడ్డి పేరు పోలీసులను షాక్ కు గురి చేస్తోంది. పన్ను ఎగవేతే ప్రధాన లక్ష్యంగా బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో గంగిరెడ్డి పేరు కనిపించింది.
కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి... ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో నిన్న ఆన్ లైన్ లోకి వచ్చేసిన పనామా పేపర్స్ లో కనిపించిన గంగిరెడ్డి పేరుపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఈ గంగిరెడ్డి... కొల్లం గంగిరెడ్డా? లేక మరో వ్యక్తా? అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. పనామా పత్రాల్లోని గంగిరెడ్డి ఎర్రడాన్ గంగిరెడ్డే అయితే అది ఆలోచించాల్సిన విషయమే. గంగిరెడ్డికి ఉన్న నేర నెట్ వర్కులోని మిగతా వ్యక్తుల బండారం కూడా బయటపడే అవకాశాలుంటాయి.