అన్ని అనుకున్నట్లుగా జరగవు. అందునా రాజకీయాల్లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. ఈ కారణంతోన కావొచ్చు.. అధినేత మనసును దోచుకునే అవకాశాన్ని వదలుకోవటానికి ససేమిరా అంటున్నారు మంత్రి గంగుల. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన బలాన్ని సమూలంగా పెకిలించి వేసేందుకు గంగుల చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అధినేత నుంచి పుష్కలంగా ఆశీస్సులు ఉండటంతో.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా రాజకీయ నేపథ్యం ఉంటే చాలు.. ఈటలకు వ్యతిరేకంగా తయారు చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.
గడిచిన కొద్దిరోజులుగా కరీంనగర్ లో మకాం వేసి గంగుల.. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నేతలకు వల విసరుతున్నారు. వారితో భేటీ అయ్యే ప్రయత్నం చేస్తూ.. ఏ చిన్న అవకాశం లభించినా.. వారికి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమానికి తెర తీస్తున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈటలను వదిలేసి.. పార్టీ వెంట నడిస్తే.. కలిగే ప్రయోజనాలు ఎంత భారీగా ఉంటాయన్న విషయాన్ని అదే పనిగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే.. తన వద్దకు తీసుకొస్తే.. అందుకు తగిన సొల్యూషన్స్ తాను చూస్తానని మాట ఇస్తున్నట్లు చెబుతున్నారు.
చిన్న నేత.. పెద్ద నేత అన్న తేడా లేకుండా ఈటల ప్రాతినిధ్యం వహిస్తునన నియోజకవర్గ పరిధిలోని నేతలు ఎవరైనా సరే.. వారిని తనకు తగ్గట్లు బ్రెయిన్ వాష్ చేయటం.. గులాబీ పార్టీకి ఈటల చేసిన ద్రోహం.. అందుకే ఆయనపై చర్యల్ని పెద్ద సారు తీసుకున్నారంటూ అదే పనిగా వివరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈటలను ఒంటరిని చేయాలన్న తలంపుతో మంత్రి గంగుల చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. గుంగుల చేపట్టిన భారీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రాం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది.