శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. అక్రమార్కులు ఎప్పుడూ తమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తుంటారు. కొత్త కొత్త దారుల్లో వ్యాపారాలను నడిపిస్తుంటారు. గుంటూరులో గంజాయి మాఫియా దందా మొదలుపెట్టింది.
ప్రస్తుతం కరోనాతో అందరూ శానిటైజర్లు తప్పనిసరిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమార్కులకు మంచి ఐడియా వచ్చేసింది. శానిటైజర్ రూపంలో గంజాయి లిక్విడ్ ను మాఫియా తయారు చేస్తోంది. శానిటైజర్ డబ్బాల్లో గంజాయి లిక్విడ్ పోసి సరఫరా చేస్తున్నారు.
తాజాగా ఈ హైటెక్ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సేవించేవారికి ఇలా అందిస్తూ కొత్త మార్గాలను కనిపెట్టారని సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు.
డిగ్రీ విద్యార్థుల చేత లిక్విడ్ రూపంలో ఉన్న గంజాయి అమ్మకాలను శానిటైజర్లుగా ముద్ర వేసి అమ్మేస్తున్నారు.అత్యవసర ఔషధం కావడంతో దీనిని ఎవరూ అడ్డుకోక ఇన్నాళ్లు ఈ దందా సాగింది.
కానీ తాజాగా ఈ గంజాయి ద్రావణం సరఫరా చేస్తున్న 8మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా డిగ్రీ విద్యార్థులు కావడంతో పోలీసులు షాక్ అయ్యారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, 55 గంజాయ్ లిక్విడ్ బాటిల్స్, రూ.30వేల నగదు , 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.