ఇది కదా లాటరీ తగలటమంటే? రూ.10వేల కోట్ల జాక్ పాట్

కాలిఫోర్నియాలోని కాటన్ వుడ్ కు చెందిన ఒక చిన్న ఫ్యామిలీ ఒక సాదాసీదా స్టోర్ నడుపుతోంది.

Update: 2025-01-03 18:30 GMT

లాటరీ తగలటమంటే అలా ఇలా కాదు. జాక్ పాట్ కొడితే ఇలా ఉండాలన్నట్లుగా అనిపించే ఉదంతమిది. లాటరీ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీగా చెబుతున్నారు. ఇంతకూ ప్రైజ్ మనీ ఎంతంటారా? అక్షరాల రూ.10 వేల కోట్లు. అమెరికాలోని ఒక చిన్న కుటుంబానికి ఈ భారీ జాక్ పాట్ తగిలినట్లుగా చెబుతున్నారు. అయితే.. వారెవరు? వారి నేపథ్యం ఏమిటి? లాంటి వివరాల్ని మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు.

కాలిఫోర్నియాలోని కాటన్ వుడ్ కు చెందిన ఒక చిన్న ఫ్యామిలీ ఒక సాదాసీదా స్టోర్ నడుపుతోంది. ఈ ఫ్యామిలీ ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ అమ్మి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ హిస్టరీలోనూ అతి పెద్ద జాక్ పాట్ గా చెబుతున్నారు. అనూహ్యంగా ఈ స్టోర్ లో అమ్మిన లాటరీ టికెట్ కే జాక్ పాట్ తగిలింది.

దీంతో ఈ స్టోర్ కు ఒక మిలియన్ డాలర్ల రిటైల్ బోనస్ అందుతుందని చెబుతున్నారు. జాక్ పాట్ తగిలిన వారి వివరాల్ని గుట్టుగా ఉంచారు.కానీ.. లాటరీ అమ్మిన స్టోర్ విషయంలోకి వెళితే..కాటన్ వుడ్ సిటీలోని రోండా రోడ్ లోని సర్కిల్ కే స్టోర్ లో ఈ టికెట్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిని భారత సంతతికి చెందిన జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు. జాక్ పాట్ తగిలిన వారే కాదు.. ఆ టికెట్ అమ్మిన దుకాణదారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యేలా రిటైలర్ బోనస్ ఉండటం అందరిని మాట్లాడుకునేలా చేస్తోంది.

Tags:    

Similar News