కొన్నిసార్లు అంతే.. ఏదో చేయాలనిపించినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏపీలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలది సరిగ్గా ఇలాంటి పరిస్థితే. టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ నుంచి బయటకు రావటం తెలిసిందే. ఆయన సభ్యత్వం మీద ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
అసెంబ్లీలో ఆయన్ను ఎక్కడైనా కూర్చోవచ్చంటూ సభాపతి స్పష్టం చేశారు. దీంతో తనకు తోచిన దగ్గర కూర్చుంటున్నారు వంశీ. ఈ రోజు (గురువారం) ఆయన అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూర్చునే చోట.. మొదటి వరుసలో కూర్చున్నారు. అది కూడా టీడీపీ ఎమ్మెల్యే బాలా వీరంజనేయ స్వామి పక్క సీట్లు కూర్చున్నారు.
సభలో హాట్ హాట్ గా చర్చ సాగుతున్న వేళ.. వంశీ చేసిన పని టీడీపీ ప్రజాప్రతినిధులకు సిరాకు పుట్టేలా చేసింది. మనసులో మండుతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో.. వారు కుతకుతలాడిపోతున్నారు. ఎందుకిలా అంటే.. ఈ రోజు మీడియా ఆంక్షల అంశం మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా వంశీ స్లిప్పులు రాసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుకు పంపారు. తమ వైపు కూర్చొని.. తమకు వ్యతిరేకంగా వంశీ చేస్తున్న పనులకు తమ్ముళ్లకు తగులుతున్న సురుకు అంతా ఇంతా కాదని చెప్పాలి.