మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావుది దాదాపుగా పాతికేళ్ల రాజకీయం. విశాఖకు వలస వచ్చిన ఆయన రాజకీయంగా అక్కడే సెటిల్ అయ్యారు. 1999లో మొదటి సారి అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలీ, 2019లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా వరసగా గెలిచి అజేయుడు అనిపించుకున్నారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ లో రెండేళ్ల పాటు క్యాబినెట్ మంత్రిగా చేసిన గంటా 2014 తరువాత టీడీపీలో చేరి మరో అయిదేళ్ల పాటు మినిస్టర్ గా కొనసాగారు. అలా ఏడేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గంటా గత నాలుగేళ్ళుగా విపక్షంలో ఉంటున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న గంటా ఈసారి తనతో పాటు తన కుమారుడిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. గంటా రవితేజాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించి తనతో పాటే అసెంబ్లీకి తేవాలని గంటా మాస్టర్ మైండ్ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.అందుకే గంటా సూచనల మేరకు గంటా రవితేజా నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ని కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారని అంటున్నారు.
నారా లోకేష్ యూత్ టీం లో గంటా రవితేజాను ముందు చూపుతోనే మాజీ మంత్రి అలా చేర్చేశారు అని అంటున్నారు. ఇక గంటా రవితేజా కూడా పోటీకి సిద్ధంగానే ఉన్నారని అంటున్నారు. ఆయన మామ మాజీ మంత్రి నారాయణ. తండ్రి గంటా మాజీ మంత్రి ఇలా ఇద్దరు దిగ్గజ నేతలకు వారసుడిగా గంటా రవితేజా రాజకీయాన్ని కెరీర్ గా ఎంచుకున్నారు అని అంటున్నారు
వచ్చే ఎన్నికల్లో తన తండ్రికి కలసివచ్చిన అనకాపల్లి నుంచే రవితేజ పోటీ చేయవచ్చు అని అంటున్నారు. అయితే అనకాపల్లి అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్ కి అయినా గంటా రవితేజా రెడీ అంటున్నారు. 1999లో గంటా అనకాపల్లి నుంచే మొదటిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉనంపుడే మంత్రి అయ్యారు. అలా అనకాపల్లి గంటా ఫ్యామిలీకి లక్కీ స్పాట్ గా ఉంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో గంటా రవితేజా నారా లోకేష్ ని కలిశారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తుందని రవితేజ ప్రకటించడం అందులో భాగమే అంటున్నారు. ఇక ఇప్పటిదాకా గంటా తన అనుచరులకే టికెట్ల కోసం అధినాయకత్వం వద్దకు వెళ్ళేవారు. అలా చాలా మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే ఈసారి తన కొడుకు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.
అర్ధ బలం అంగబలం కలిగిన గంటా వచ్చే ఎన్నికల్లో తనతో పాటు చాలా మందిని గెలిపించే విధంగా అధినాయకత్వానికి మాట ఇస్తారని, అదే టైంలో తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే అయినా ఎంపీ టికెట్ అయినా సాధిస్తారు అని అంటున్నారు. గంటా రవితేజా గతంలో ఒకే ఒక సినిమా చేశారు. హీరోగా పరిచయం అయ్యారు. కానీ సినీ కెరీర్ అచ్చి రాలేదని భావించి ఆయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
మొత్తానికి గంటాను రాజకీయ అదృష్టవంతుడిగా అంతా చెబుతారు. మరి ఆయన తనయుడు కూడా రాజకీయంగా సక్సెస్ అవుతారా. ఆయన 2024లో పోటీ చేయడం ఖాయమేనా. ఇంతకీ ఆయన వెళ్ళేది పార్లమెంట్ గా అసెంబ్లీకా అన్నది ప్రస్తుతం టీడీపీలో సాగుతున్న చర్చగా ఉంది.