ఏపీలో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ‘గంటా’నా?

Update: 2020-06-25 14:30 GMT
అధికారంలోకి వచ్చిన ఏడాదికి టీడీపీ నేతల వేట మొదలుపెట్టిన వైసీపీ సర్కార్ మొదట అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను విజయవంతంగా జైలుకు పంపింది. ఇప్పుడు నెక్ట్స్ ఎవరనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరిగిన శాఖల గుట్టు తేలుస్తూ ముందుకెళుతోంది. తాజాగా మరో మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు మహిళ నేతలపై వివాదాస్పద పోస్టులు పెట్టిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంలో ఆయన పాత్ర ఉందన్న ఆధారాలు పోలీసులకు లభించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో నెక్ట్స్ గంటానే అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తన అనుచరుడి అరెస్ట్ పై గంటా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ పనిచేశారని.. దీనిని ఎదుర్కొంటానని తెలిపారు.

అయితే తాజాగా ఈ కేసులో గంటా ఇంట్లో వ్యక్తుల పేర్లు, ఇతర అనుచరుల పేర్లు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఐడీ దగ్గర ఆధారాలున్నాయని ఈ కేసు వెనుక ఎవరున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు.

దీంతో గంటా అరెస్ట్ కూడా తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి మాటలను బట్టి త్వరలో గంటా కూడా టార్గెట్ అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News