గంటా రాజ‌కీయం జ‌న‌సేన దిశగానా ?

Update: 2021-04-08 07:30 GMT
సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ఇప్పుడు జ‌న‌సేన వైపు అడుగులు వేస్తున్నారా ? ఆయ‌న ఆలోచ‌న‌లు ఆ దిశ‌గానే సాగుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన గంటా శ్రీనివాస‌రావు.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. అదే స‌యమంలో ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా.. ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాలు మారినా విజ‌యం సాధిస్తూనే ఉన్నారు. టీడీపీతో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన గంటా.. త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలోకి మారారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో మంత్రి ప‌ద‌వి తెచ్చుకున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీలోకి చేరారు. చంద్ర‌బాబు హ‌యాంలో 2014 నుంచి మంత్రిగా ప‌నిచేశారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఐదేళ్లు మంత్రిగా చేసే అవ‌కాశం క‌ల్పించిన టీడీపీని, గత ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చిన చంద్ర‌బాబును కూడా ఇప్పుడు ఆయ‌న లెక్క చేయ‌డం లేదు. పైగా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు వైసీపీలోకి చేరుతున్నార‌నే లీకులు ఇస్తూ.. రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల విశాఖ ఉక్కు ఉద్య‌మానికి మ‌ద్ద‌తంటూ.. ఏకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గ‌ట్టి హామీ వ‌స్తే.. వైసీపీలోకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ అలా కాని ప‌క్షంలో జ‌న‌సేన‌లో చేరిపోయి.. రాజ‌మండ్రి లేదా.. భీమ‌వ‌రం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. తాను ఎక్క‌డ నుంచి ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా గెలుస్తాన‌నే ధీమానే ఆయ‌న‌ను ఈ విధంగా మార్చుతోంద‌న్న‌ది వాస్త‌వం. అందుకే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీని ప‌క్క‌న పెడుతున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. త‌న బ‌లంతోనే గెలుపు గుర్రం ఎక్కుతున్నాన‌నే ధీమా.. పార్టీల‌ను లెక్క చేయ‌ని వ్య‌వ‌హారం వంటివి ప్ర‌స్తుతం ఆయ‌న‌కు బ‌లంగా ఉన్నా.. రోజులు అన్నీ ఒకేలా ఉంటాయ‌ని అనుకోలేం.

ఆయ‌న ఎక్క‌డ ఉన్నా పెత్తనం అంతా ఆయ‌నే చేయాల‌నుకుంటారు. ఇప్పుడు టీడీపీలో అది సాధ్యం కావ‌డం లేదు. వైసీపీకిలోకి వెళితే ఈ పాటి గౌర‌వం కూడా ఉండే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌డం లేదు. అదే జ‌న‌సేలోకి వెళితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఖ‌చ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్ర‌భావం చూపుతుంద‌ని... అప్పుడు అక్క‌డ తానే మొత్తం చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌న్న ప్లాన్‌లోనే గంటా ఉన్నార‌ని ఆయ‌న అనుచ‌రుల ద్వారా లీక్ అవుతోన్న స‌మాచారం. ప్రజారాజ్యంలో గంటా ఈ త‌ర‌హా రాజ‌కీయ‌మే చేసి తన పై చేయి చాటుకున్నారు. సో.. గంటా ఇప్పుడు జ‌న‌సేన వైపు చూస్తున్నా.. భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందోన‌నే ఆలోచ‌న మాత్రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News