ఆయ‌న గంటా కాదు... గంట‌లుగంట‌లు

Update: 2016-11-30 06:02 GMT
ఎంసెట్ ప‌రీక్ష‌కు నిమిషం ఆల‌స్యంగా వ‌స్తే రాయ‌నివ్వ‌రు... ఎడ్ సెట్ కు క్ష‌ణ ఆల‌స్య‌మైతే గేట్లు మూసేస్తారు.. ఆసెట్ - లాసెట్ - పాలీసెట్.. ఇలా ఏ  సెట్ అయినా స‌రే ప‌రీక్ష హాలుకు స‌మయానికి రాక‌పోతే ఆ విద్యార్థి ఆ సంవ‌త్స‌రానికి అవ‌కాశం కోల్పోయిన‌ట్లే. ఇలా అవ‌కాశం పోగొట్టుకున్న‌వారు వేలాది మంది. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా ఆప‌లేని.... పేప‌ర్లు లీకవ‌కుండా ఆప‌లేని యంత్రాంగం - మంత్రాంగం పాపం విద్యార్థుల‌ను మాత్రం నానా ఇబ్బందుల‌కు గురిచేసి ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించల‌ని చూస్తుంది. అందులో భాగ‌మే ఈ స‌మ‌య పాల‌న. మ‌రి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కుండాల్సిన ఈ స‌మ‌య‌పాల‌న విద్యాశాఖ‌ను నిర్వ‌హించే మంత్రిగారికి ఉందా? అంటే లేద‌నే స‌మాధానం. శాఖాప‌ర‌మైన మీటింగులు - ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కే కాదు చివ‌ర‌కు ప్రెస్ మీట్ కు కూడా మంత్రిగారు మూడు గంట‌లు ఆలస్యంగా వ‌స్తార‌ట‌.

వివిధ సెట్లపై కసరత్తు జరుగుతున్న సమయం. అన్ని సెట్లు ఆన్‌ లైన్‌ లో నిర్వహించాలా? వద్దా? అంత సామర్థ్యం ఉన్న సంస్థలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో మంత్రి గంటా మీడియాతో భేటీ అవుతారని సమాచారం వచ్చింది. వచ్చిన అరగంటలోనే మీడియా ప్రతినిధులంతా వెళ్లినా రెండున్నర గంటల వరకూ మంత్రి రాలేద‌ట‌. పోనీ మంత్రి మీడియా భేటీ రద్దయిందని సొంత శాఖ అధికారులేమైనా సమాచారం ఇచ్చారా అంటే అదీ లేదు. అదీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి. అన్ని సెట్లను ఆన్‌ లైన్‌ లో నిర్వహించే అంశంపై జరుగుతున్న పురోగతిని వివరించేందుకు, మంగళవారం 2 గంటలకు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ కు రావాలని 1.18కి మీడియాకు సమాచారం ఇచ్చారు. దానితో 1.30కే మీడియా ప్రతినిధులు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ కు వెళ్లారు. సమయం 3.30 అవుతున్నా మంత్రి గారు పత్తాలేరు. పోనీ సమావేశం ఉందో లేదో కూడా సమాచారం ఇవ్వలేదు. దీనితో విసిగిపోయిన మీడియా ప్రతినిధులు 4 గంటల వరకూ చూసి వెళ్లిపోయారు.

కాగా మంత్రి గంటా ఇలా చేయ‌డం ఇదే తొలిసారి కాద‌ట‌. ఆయ‌న స‌మావేశం అంటే ఎన్ని గంట‌లు ఆల‌స్యంగా మొద‌ల‌వుతుందో ఎవ‌రూ చెప్ప‌లేన‌రి మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. విద్యార్థుల‌కు చెప్పే స‌మయ పాల‌న పాఠాలు మంత్రి స్వ‌యంగా పాటిస్తే బాగుంటుంద‌ని చుర‌క‌లు వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News