కేంద్ర మాజీ మంత్రి - దివంగత ఎన్టీఆర్ కుమార్తె - ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి ఊహించని రిప్లై వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, ఏపీ అభివృద్ధి గురించి మీడియాతో మాట్లాడిన పురందేశ్వరీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏపీకి ఎంతో మద్దతు ఉందని చెప్పారు. అదే సమయంలో టీడీపీ తీరును ఆమె తప్పుపట్టారు. దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు.
కడప పర్యటనలో ఉన్న గంటా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుపై కోపం - వ్యక్తిగత కక్షలు ఉంటే, వాటిని వ్యక్తిగతంగానే చూసుకోవాలని అన్నారు. పరిపాలన బాగాలేదని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. గత బడ్జెట్ లో రాష్ట్రానికి తక్కువ నిధులిచ్చారని, చేతనైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించవద్దని హెచ్చరించారు. ఏపీ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ముందుకువెళుతున్నది, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాల తీరు ఎలా ఉందనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని గంటా వ్యాఖ్యానించారు.