అంతరిక్షంలో చెత్త పేరుకుపోయింది..! మీరు విన్నది నిజమే!

Update: 2021-01-07 01:30 GMT
భూమి మీద చెత్త పేరుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ చెత్తతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం అవుతోంది. అయితే అంతరిక్షంలో కూడా చెత్త పేరుకుపోయిందట. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్తను స్పేస్ జంక్ అని పిలుస్తారు. భూమి మీద నుంచి పంపిన శాటిలైట్స్​ పాడైపోయిన తర్వాత శిథిలాలుగా మారుతున్నాయి. ఇవే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త. అయితే భూమి మీద అయితే చెత్త భూమిమీద పడిపోయి ఉంటుంది. కానీ అంతరిక్షంలో మాత్రం ఆ అవకాశం లేదు. అక్కడ స్పేస్​ శిథిలాలు గాలిలో కదలాడుతూ ఉంటాయి.

ఒకవేళ అక్కడ మనం నడిస్తే అవి మనకు తాకుతాయి.
అయితే అంతరిక్షంలో పేరుకుపోయిన ఈ చెత్త మానవజాతికి ప్రాణాంతకంగా మారిందట. అంతరిక్షంలో ఉన్న ఆ పాడైపోయిన శిథిలాలు ఇప్పుడు భూమి క్షక్ష చుట్టూ ప్రమాదకరంగా తిరుగుతున్నాయట. నాసా సైంటిస్టు జోస్ విల్లాస్ ఈ విషయంపై మాట్లాడుతూ.. భూమి మీద కంటే అంతరిక్షంలోనే చెత్త ఎక్కువగా పేరుకుపోయిందని అన్నారు. సాధారణంగా ఏదైనా మిషన్​ పూర్తయిన వెంటనే పనిచేయని శాటిలైట్లను తిరిగి భూ వాతావరణంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే వాటిని అక్కడే కాల్చివేస్తున్నారు.

దీంతో వేల సంఖ్యలో అల్యుమినియం కణాలు విడుదలువుతున్నాయి. వీటితో ఎంతో ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.  అంతరిక్షంలో పేరుకుపోయిన ఈ చెత్త సమస్యను నివారించేందుకు జపాన్​ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారం సూచించారు. చెక్కతో చేసిన శాటిలైట్లను పంపించడం ద్వారా అంతరిక్షంలో చెత్తను పేరుకుపోకుండా నివారించవచ్చని వాళ్లు అంటున్నారు.
Tags:    

Similar News