సాంకేతికత అందుబాటులోకి వస్తున్నకొద్ది అద్భుతాలు కొన్ని ఆవిష్కృతమవుతున్నాయి. అసాధ్యమనుకునే అంశాలు సాధ్యమవుతున్న పరిస్థితి. తాజాగా అలాంటి ఒక అద్భుతం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. మనిషి జీవిత క్రమాన్ని నియంత్రించుకునే వీలుంది. మనిషికి ఎంతో నచ్చే యవ్వనంలో ఎక్కువ కాలం గడిపే అవకాశం ఇవ్వనుంది. కాకుంటే.. అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగాలు పూర్తి స్థాయిలో సఫలమైతేనే సుమా. ఇప్పటికే అభివృద్ధి చేసిన దాని ప్రకారం ఎలుకల మీద ప్రయోగాలు చేస్తున్నారు. సానుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మనుషులు దీన్ని ఉపయోగించుకునే రోజు రావటం ఖాయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మనిషి జీవితంలో యవ్వన కాలాన్ని ప్రతిఒక్కరూ ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి కాలాన్ని మరికొద్దికాలం ఉండిపోతే బాగుండని ఫీలవుతారు. కానీ.. కాలం ఎవరిని దేన్ని ఆపదు. కానీ.. మనిషి అద్భుత ఆవిష్కరణ పుణ్యమా అని వయసును ప్రభావితం చేసే ఒక పిల్ ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ప్రకారం మనిషి యవ్వన కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉండనుంది. విటమిన్ బీ..సీ..డీ.. ఫోలిక్ యాసిడ్.. గ్రీన్ టీ లాంటి 30 రకాల మూలకాల నుంచి అభివృద్ధి చేసిన ఈ ‘పిల్’ యవ్వనాన్ని పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే అభివృద్ధి చేసిన ఈ పిల్ ను ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. 22 నెలలున్న ఎలుకల మీద ఈ మాత్రను ప్రయోగించినప్పుడు అవి తమ వయసులో యాభైశాతం వెనక్కి వెళ్లినట్లుగా గుర్తించారు. 22 నెలల ఎలుక 70.. 80 ఏళ్ల మనిషితో సమానంగా చెబుతున్నారు. ఎలుకల మీద ప్రయోగిస్తున్న మాత్రను మరింత అభివృద్ధి పరిస్తే వృధాప్యం మరింత వెనక్కి వెళ్లి.. యవ్వనంతో మరింత కాలం ఉండే వీలుంది. ఈ మాత్రను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిస్తే అల్జీమర్స్.. పార్కిన్సన్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వరంగా మారనుందని చెప్పొచ్చు.