బ్యాచలర్ లైఫ్ కు మించింది లేదన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడున్న ఫ్రీ లైఫ్ కు మంచి ఉద్యోగం ఉంటే చాలు.. జీవితం సుఖంగా సాగి పోతుందన్నది ఒక కోణం మాత్రమే. అందరూ ఒకేలా ఉండరు. మంచి కంపెనీ లో ఉద్యోగం.. ఎలాంటి ఇబ్బందులు లేవనుకునే ఆ యువకుడికి ఎంతకూ పెళ్లి కాకపోవటం పెద్ద సమస్య గా మారింది. ఇప్పుడదే సమస్య ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఒక ప్రముఖ ఐటీ కంపెనీ లో పని చేసే 33 ఏళ్ల సన్నీ బాబుకు పెళ్లి కావట్లేదన్న దిగులు అంతకంతకూ పెరిగిపోయింది. ఎంతలా ప్రయత్నిస్తున్న పెళ్లి కాక పోవటాన్ని జీర్ణించుకోలేని అతడు సూసైడ్ చేసుకున్నాడు. తన భావ సంపత్ కుమార్ కు మంగళవారం రాత్రి ఈ మొయిల్ చేశాడు.
అందులో తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ మొయిల్ చూసినంతనే పరుగులు తీస్తూ బాబు దగ్గరకు వచ్చేసరికి.. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలో ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లి కాకపోవటం.. ఒంటరి తనంతో వచ్చిన కుంగుబాటు తో సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సన్నీ బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా చెబుతున్నారు. పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న ఐటీ ఉద్యోగి ఉదంతం సంచలనంగా మారింది.