ప‌వ‌ర్ ఫుల్ లేడీ గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు

Update: 2019-06-28 04:33 GMT
ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ల్లో ఒక‌రుగా చెబుతారు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ ను. అలాంటి ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. మ‌రోరెండేళ్ల‌లో చాన్స‌ల‌ర్ గా ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది. అనంత‌రం తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ఇప్ప‌టికే చెప్పిన ఆమె.. ఆరోగ్యానికి సంబంధించి కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జ‌పాన్ లోని ఒసాకాలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఆమె ఎయిర్ పోర్ట్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమె శ‌రీరం అప్ర‌య‌త్నంగా వ‌ణికిపోయింది. ఆ స‌మ‌యంలో ఆమె వెంట దేశాధ్య‌క్షులు కూడా ఉన్నారు. ఓప‌క్క దేశాధ్య‌క్షుడు మాట్లాడుతున్న వేళ‌.. ఆమె దాదాపు రెండు నిమిషాల‌పాటు వ‌ణికిపోవ‌టం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

దీంతో.. అక్క‌డే ఉన్న ఫోటోగ్రాఫ‌ర్ ఒక‌రు ఆమె వ‌ణికిపోవ‌టాన్ని గుర్తించి వీడియో తీశారు. త‌న శ‌రీరంలో వ‌ణుకు త‌గ్గ‌టానికి ఆమె త‌న రెండు చేతులు ముడుచుకోవ‌టం క‌నిపించింది. కాసేప‌టికి ఆమె ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఆమె ప‌డుతున్న ఇబ్బందిని గుర్తించిన సిబ్బంది మంచినీళ్లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొద‌ట మంచినీళ్ల‌ను తీసుకునేందుకు చేయి జాపిన ఆమె ఆ వెంట‌నే అక్క‌ర్లేద‌న్నారు.

ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌టంతో వైర‌ల్ గా మారింది. యూరోపియ‌న్ యూనియ‌న్ లో అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా పేరున్న మెర్కెల్ ఆరోగ్యం భేషుగ్గా ఉంద‌ని.. ఆమె షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవ‌ని.. ఆమె ఏ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్న‌ది లేద‌ని చెబుతున్నారు. గ‌తంలోనూ డీహైడ్రేష‌న్ కార‌ణంగా వ‌ణుకు ఏర్ప‌డిన‌ట్లుగా చెబుతారు. తాజా వ‌ణుకు వెనుక కార‌ణం ఏమిటో మాత్రం ఇంకా తేల‌లేదు.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News