గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ అనూహ్య ఎత్తుగడను వేసింది. టీఆర్ఎస్ తో చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠం పద్ధతిని పంచుకోవాలనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. రోటేషన్ పద్ధతిని తెరమీదకి తీసుకొని రావాలని గట్టిగా ప్రయత్నించింది.ముందుగా జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో మజ్లిస్ 44మంది కార్పొరేటర్లు అంతా దారుస్సలాంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, నేతలు కూడా మేయర్ ఎన్నికపై చర్చించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠాన్ని పంచుకోవాలని ఎంఐఎం స్కెచ్ గీసింది. హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కు సపోర్టు చేయాలని బావించింది. ఈ మేరకు టీఆర్ఎస్ కు కొన్ని డిమాండ్లను టీఆర్ఎస్ ముందు ఉంచిందట.. ఇదే అంశంపై దారుస్సలాం సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం.
అయితే మేయర్ ఎన్నిక వేళ టీఆర్ఎస్, బీజేపీలు విప్ జారీ చేయగా.. ఎంఐఎం జారీ చేయలేదు. దీంతో ఆ మజ్లిస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ కు మద్దతు పలకడంతో గులాబీ పార్టీ మేయర్ పీఠాన్ని సునాయాసంగా గెలుచుకోగలిగింది. విప్ జారీ చేయకపోవడంతో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు చెదిరిపోయారు. టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించారు. మేయర్ పీఠాన్ని సగం రోజులు ఏలుదామనుకున్న మజ్లిస్ పార్టీ ఎత్తుగడ పారలేదు.