ఓపక్క బీద అరుపులు.. మరోపక్క భారీగా ఖర్చులు. ఇదీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారంగా మారింది. చుట్టు అప్పులు చుట్టుముట్టిన సమయంలో ఆచితూచి చేయాల్సిన ఖర్చుల స్థానే ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. కానీ.. ఏపీ సర్కారు ఇలాంటివేమీ ఆలోచించటం లేదు. వీలైనంత మందిని సంతృప్తి పర్చటమనే దివంగత నేత వైఎస్ కాన్సెప్ట్ లోకి వెళ్లిన చంద్రబాబు.. అవసరం లేకున్నా ఖర్చులు చేస్తున్నారన్న ఆరోపణలు చుట్టుముడుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు గిఫ్ట్ ప్యాక్ లు ఇచ్చే కల్చర్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. నిజానికి అలాంటివేమీ అవసరం లేకున్నా.. ఎమ్మెల్యేల మనసుల్ని దోచుకోవటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శ ఉంది. తాజాగా ఏపీ సర్కారు ఇలాంటి గిఫ్ట్ ప్యాక్ లను ఎమ్మెల్యేలకు అందజేసింది. ఇంతకీ ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉన్నవి చూస్తే కాస్తంత షాక్ తినాల్సిందే.
ఖరీదైన ఐఫోన్ 6ప్లస్ డివైజ్ తో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ.. అరకు కాఫీ పొడితో కూడిన గిఫ్ట్ ప్యాక్ ను అందజేశారు. అసంబ్లీలో ఏర్పటు చేసిన ప్రత్యేక రిజిష్టర్ లో సంతకం పెట్టటం ద్వారా.. సభ్యులందరికి ఈ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదం.. అరకు కాపీపొడి ప్యాకెట్లను ఇవ్వటాన్ని ఎంతోకొంత అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఖరీదైన ఐఫోన్ ఇవ్వాల్సిన అసవరం ఏమిటన్నది ముఖ్యమంత్రి చంద్రబాబుకే అర్థం కావాలి.