అల్లం తింటే కరోనా దగ్గరికి రాదా?

Update: 2020-07-19 23:30 GMT
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు కరోనా వేళ అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా బాగా దాడి చేసే ప్రాంతాలపైనే అల్లం మహా ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

శాస్త్రీయంగా నిరూపితం కాకున్నా అల్లం తింటే మాత్రం మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుందని ఇదివరకే పరిశోధనల్లో తేలింది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరిగితే ఎలాగూ కరోనాను ఎదుర్కోవచ్చు. సో అల్లం పరోక్షంగా కరోనాను దరిచేరనివ్వదని నిపుణులు చెబుతున్నారు.

అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి  వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా అల్లం బాగా కంట్రోల్ చేస్తుంది. విపరీతమైన దగ్గు వేధిస్తుంటే అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని తింటే మంచి ఉపశమనం ఇస్తుందని తేలింది.

ఇక అల్లం టీ -అల్లం పచ్చడి - అల్లం చారు తిన్నా మేలే. మధుమేహాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుందని తేలింది. కీళ్లనొప్పులు తగ్గించడంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది.

ఇక అజీర్తి సమస్యలకు అల్లం మంచి వనరు. వికారాన్ని తగ్గిస్తుంది. ప్రతీ ఉదయం చిన్న అల్లం ముక్క తింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.


Tags:    

Similar News