ఇద్ద‌రు మించితే ఓటు ర‌ద్దు చేయాల‌న్న కేంద్ర‌మంత్రి!

Update: 2019-07-12 04:59 GMT
వివాదాస్ప‌దంగా మాట్లాడ‌టం.. కొత్త త‌ర‌హా వాద‌న‌ను వినిపించ‌టం బీజేపీ నేత‌ల‌కు కొత్తేం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన ప‌లువురు క‌మ‌ల‌నాథుల‌కు భిన్నంగా తాజాగా కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. కొత్త చ‌ర్చ‌కు తెర తీసేలా ఉన్నాయ‌ని చెప్పాలి.

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్ర‌తిఒక్క‌రికి ఓటు హ‌క్కు క‌ల్పించిన భార‌త రాజ్యాంగానికే స‌వాలు అన్న‌ట్లుగా కేంద్ర‌మంత్రి మాట‌లు ఉన్నాయి. దేశ జ‌నాభా అంత‌కంత‌కూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో.. దాన్ని క‌ట్ట‌డి చేసేందుకు గిరిరాజ్ అనూహ్య రీతిలో ఒక కొత్త ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు.

దేశ జ‌నాభా అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని.. ఈ కార‌ణంగా ఆర్థిక స‌మ‌తుల్య‌త దెబ్బ తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. జనాభాను నియంత్రించ‌లేక‌పోవ‌టానికి మ‌త‌ప‌ర‌మైన అడ్డంకులు ఒక కార‌ణంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అందుకే.. ఇద్ద‌రు కంటే ఎక్కువ‌మంది పిల్ల‌లు ఉన్న వారికి ఓటుహ‌క్కు ర‌ద్దు చేయాల‌న్నారు. సంతానానికి ఓటుహ‌క్కుకు వెరైటీగా లింకు పెట్టిన కేంద్ర‌మంత్రి మాట‌లు పెను దుమారంగా మార‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News