ఓవైపు ఉత్తరప్రదేశ్ లో జరిగిన హత్రాస్ అత్యాచార ఘటనపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ కేసులో దోషులకు వెంటనే శిక్ష పడాలని దేశం మొత్తం కోరుతోంది. అయినప్పటికి ఏం లాభం., అదే ఉత్తరప్రదేశ్ లో వరుసగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజాలో పాల్గొని వస్తున్న ఓ 19 ఏళ్ల యువతి పై కిరాతకంగా ముగ్గురు యువకులు దాడి చేసి , గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..యూపీలోని మహోబా జిల్లాలో బుధవారం రాత్రి ఓ 19 ఏళ్ల అమ్మాయి , స్థానికంగా ఉన్న అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొని , పూజ ముగించుకొని , హరతి తీసుకున్న తర్వాత ఇంటికి తిరిగి పయనమైంది. అయితే దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి , ముగ్గురు కలిసి ఆ యువతి పై సామూహిక అత్యాచారం చేశారు. పన్వాడీ ప్రాంతంలో నిందితుడు తన ఇంటి వెనుక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఎస్సై అరుణ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశామని, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇకపోతే , ఇటీవల యూపీలోని హత్రాస్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. 20 సంవత్సరాల దళిత యువతి మీద అత్యంత దారుణంగా అత్యాచారం, దాడి చేసిన వారిని శిక్షించాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే, ఆమె మీద అత్యాచారమే జరగలేదని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. హత్రాస్ జిల్లాలో బాధితురాలు చనిపోవడానికి కేవలం మెడ మీద గాయం, దాని వల్ల ఏర్పడిన సమస్యే కారణమని కుమార్ స్పష్టం చేశారు. ఆ తర్వాత మరింత వివాదం ముదిరింది. బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు అనుమతి ఇవ్వకపోవడం, మీడియాను కూడా వారిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల, పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల యూపీలో యోగి పరువు పోతుందని ఉమా భారతి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తుంది.